28.7 C
Hyderabad
April 28, 2024 03: 19 AM
Slider జాతీయం

విశ్లేషణ: ప్రపంచం బతకడానికి పైసలు కావాలి

#International Monitory Fund

కోవిడ్19 మహమ్మారి విజృంభణ కు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం మారిపోయింది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి ఆర్ధికంగా బలమైన దేశాలు సైతం పదేళ్లు వెనక్కు వెళ్ళినట్లు  ఆర్థికరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి స్థూల అంతర్జాతీయ ఉత్పత్తి లో అర్ధభాగానికి పైగా ఈ దేశాలదే.

రానున్న రోజుల్లో వస్తు సేవలు, ఉత్పత్తి రంగాలలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. అంతర్జాతీయ ద్ర వ్య నిధి (ఐ ఎం ఎఫ్) తాజా అంచనా ప్రకారం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కనీసం 4 శాతం దిగువకు పడిపోనుంది.

దారుణంగా పడిపోతున్న వృద్ధి రేటు

ముందస్తు అంచనా ప్రకారం ఐరోపా దేశాలలో 2020 లో 7.5 శాతం వృద్ధి నమోదు కానుండగా 2021 లో కేవలం 4.7 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావచ్చని తెలిపింది. భారతదేశం పరిస్థితి కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అంతకన్నా తగ్గినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

మిగిలిన ఆసియా దేశాలలో కూడా ఇదే తరహా వృద్ధిరేటు సాధ్యం కాగలదని ఐ ఎం ఎఫ్ ఊహిస్తోంది. కరోనా ప్రభావంతో అన్ని ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురికానున్నట్లు  ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. విశ్వవ్యాప్తంగా సగటున 9% నిరుద్యోగం రేటు పెరిగినట్లు తెలుస్తోంది.

అమెరికాలో నిరుద్యోగం విలయతాండవం

ఒక్క అమెరికాలోనే 2 కోట్ల మంది తాజాగా నిరుద్యోగులైనట్లు అధికారి కంగా ఆ దేశం ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఛీఫ్ క్రిస్టాలినా గోర్గివా  ఇటీవల యూరోపియన్ యూనివర్సిటీ నిర్వహించిన ఆన్ లైన్ ఈవెంట్ లో పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

వైరస్ నియంత్రణ సాధ్యం కానంత వరకు ప్రపంచ దేశాలకు ఆర్థిక తిరోగమనం తప్పదన్నారు. అమెరికా, చైనా దేశాలకు చెందిన వాణిజ్య నిపుణుల అంచనా ప్రకారం  ప్రస్తుతం అమలులో ఉన్న  వ్యాపార ఒప్పందం లో గణనీయ తగ్గుదల 2017 స్థాయికి పడిపోయినట్టు విశదమౌతున్నది.

ఆర్ధిక సాయం కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపు

ఐ ఎం ఎఫ్ ఇప్పటి వరకు అత్యవసర నిధి అర్థించిన 130 దేశాలలో 50 దేశాలకు సహాయం అందించినట్లు ఆ సంస్థ ఛీఫ్ ప్రకటించారు. దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల నిధుల సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఐఎంఎఫ్ వైపు చూస్తున్నాయి.

ఆయా దేశాలలో ప్రజల ఆరోగ్యం, ఆర్థికవృద్ధి లక్ష్యంగా నిధుల సహాయం ఉపయుక్తంగా ఉండగలదు. ఏప్రిల్ 15 నాటికి చైనా  జీడీపీ 2.5 నుంచి 4.7 శాతానికి  తగ్గినట్లు ఆర్ ఐ ఎస్ – డైరెక్టర్ జనరల్ సచిన్ చతుర్వేది తెలిపారు. కోవిడ్-19 దెబ్బకు సుమారు  63 బిలియన్ డాలర్లు ప్రపంచ రవాణా వ్యవస్థ నష్టపోయిన ట్లు అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ తెలిపింది.

సినీ పరిశ్రమకు భారీ నష్టాలు

సినిమా ఇండస్ట్రీ కి మార్చి నాటికి 5 నుంచి 6 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లిందని అంచనా. ఎఫ్ఐఇఒ విడుదల చేసిన ప్రకటనలో… యూరప్,నార్త్ అమెరికా దేశాలలో లెదర్, దుస్తులు, చేతి తయారీ ఉత్పత్తుల విక్రయాలు 30 నుంచి 60 శాతం తగ్గినట్లు తెలిపింది.

స్థూలంగా పరిశీలిస్తే ….ప్రపంచ దేశాలలో  ఆర్ధిక వ్యవస్థ పూర్వ దశకు త్వరితగతిన చేరగల అవకాశాలు లేవని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలలో భారత్ అజేయశక్తిగా అవతరించగల అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇప్పటికే ప్రపంచ దేశాలతో భారత్ కు ఉన్న సుహృద్భావ సంబంధాలు మరింత మెరుగ్గా వృద్ధి చెందగలవని పరిశీలకులకు గట్టి నమ్మకం.

కృష్ణారావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

10 లీటర్ల లోపు మద్యంతో పట్టుబడిన వారిపై కేసు ఎత్తివేత

Satyam NEWS

గిరిజనుల కోసం ప్రత్యేకంగా గిరి వికాస్ పథకం

Satyam NEWS

వైభవోపేతంగా శ్రీ సంజీవరాయ స్వామి వారి పొంగళ్ళు

Satyam NEWS

Leave a Comment