40.2 C
Hyderabad
April 29, 2024 15: 41 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో కదం తొక్కిన ఐ ఎన్ టి యు సి కార్మికులు

#padmavati

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మేడే సందర్భంగా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో మేడే పండుగ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు,మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఐ ఎన్ టి యు సి జెండాలను ఆవిష్కరించి మాట్లాడుతూ దేశంలో కార్మిక లోకానికి అన్యాయం జరిగే విధంగా పోరాడి తెచ్చుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానం అమలయ్యే విధంగా,కార్పోరేట్ శక్తులకు లాభం జరిగే విధంగా ఎన్డీఏ బిజెపి ప్రభుత్వం చట్టాల సవరణ చేస్తుందని,దానికి వంత పాడుతూ ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేయడానికి డొంకదారిన ప్రయత్నిస్తుందని, వెంటనే ఆ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ఐ ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ అసంఘటిత కార్మిక లోకానికి అన్యాయం చేయటానికి పూనుకుందని,నిరుపేదల పట్ల ఎలాంటి ప్రేమ లేని బిజెపి ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించాలని,కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్,ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య,చింతకాయల రాము,పాశం రామరాజు,గుంటుక కరుణాకర్ రెడ్డి,సలిగంటి జానయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,ఈడుపుగంటి సుబ్బారావు,దొంగరి వెంకటేశ్వర్లు,త్రిపుర అంజన్ రెడ్డి,దొంగరి సత్యనారాయణ, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు,కారింగుల వెంకన్న, అంజనపల్లి సుదర్శన్,యరగాని భిక్షం, గడ్డం నాగయ్య,అజ్మతుల్లా,ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు డ్రైవర్స్ యూనియన్,రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, రాజీవ్ గాంధీ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్,కల్లుగీత కార్మిక యూనియన్,దక్కన్ సిమెంట్స్ ఎంప్లాయిస్ యూనియన్,సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్,లారీ డ్రైవర్స్ యూనియన్,ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్,బ్రిక్ వర్కర్స్ యూనియన్ తదితర కార్మిక సంఘాల నేతలు,కార్మికులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఇంటింటా చదువుల పంట కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

హుజూర్ నగర్ అదనంగా మరొక ATM ఏర్పాటు చేయాలి

Satyam NEWS

జగనన్న వదిలిన బాణం బూమరాంగ్ అవుతుందా?

Satyam NEWS

Leave a Comment