37.2 C
Hyderabad
April 30, 2024 12: 41 PM
Slider గుంటూరు

వావిలాలను స్మరించుకోవడం మన బాధ్యత

#lavukrishnadevarayulu

సత్తెనపల్లి గడ్డలో నడయాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ను స్మరించు కోవడం మన బాధ్యతని, ఆయన కీర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం వావిలాల గోపాలకృష్ణయ్య 20వ వర్ధంతి కార్యక్రమం వావిలాల స్మృతి వనంలో జరిగింది. 

ఈ కార్యక్రమానికి వావిలాల మనవడు మన్నవ సోడేకర్ అధ్యక్ష వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ  ఒక వడ్డెర శ్రామికుడు సత్తెన్న  నిర్మించిన సత్తెనపల్లి గడ్డలో, మరో మహానుభావుడు వావిలాల గోపాలకృష్ణ నలయాడిన  నేలపై వారి ఇరువురి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పేలా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వావిలాలను మాజీ ముఖ్యమంత్రి విజయ భాస్కర్ రెడ్డి లాంటి వారు సైతం ఎంతో గౌరవించడం ప్రత్యక్షంగా చూసానని అంబటి వివరించారు.

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య జీవన విధానం చాలా నిరాడంబరంగా ఉండేదని, ఆయన జీవిత చరిత్రను, ఆయన స్ఫూర్తిని నేటి విద్యార్థులకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నిత్యం రాజకీయాలతోనే కాకుండా ప్రజలతో మమేకమయ్యే సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించడంలో అంబటి ముందుంటారన్నారు. వావిలాలలా నిరాడంబరంగా ఎన్నికలు చేసే పరిస్థితి లేదని, ప్రజలు ఆర్థిక వనరులు ఆశించినా ..,నచ్చిన వారికి ఓటేసి  గెలిపించాలని సూచించారు.

పల్నాడు జిల్లా కలెక్టర్ లో తోటి శివశంకర్ మాట్లాడుతూ  బ్రిటిష్ వారి సమయంలో పశువుల ను అడవుల్లో తోలి మేపుకున్నందుకు పుల్లరి అనే పన్ను వేశారని, దానికి వ్యతిరేకంగా కూడా వావిలాల పోరాడారని గుర్తు చేశారు. నాగార్జునసాగర్ నిర్మాణంలోనూ, మద్యపాన నిషేధ ఉద్యమంలోనూ ,జాతీయస్థాయిలో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో ఇక్కడ వావిలాల ముందు నడిపించడం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలో రూ.1200 కోట్ల నగదును పారదర్శికంగా లబ్దారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. విజయనగరానికి చెందిన సామాజిక కార్యకర్త పారినాయుడు అనుబంధాన్ని వివరించారు.

మున్సిపల్ నాయకులు చలంచర్ల సాంబశివరావు, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీత హసంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగూర్ మీరాన్, కోటేశ్వరావు నాయక్,బాసులింగారెడ్డి ,మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబురావు, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్ సహారా మౌలాలి, మున్సిపల్ కమిషనర్ షమ్మీ, వావిలాల ప్రజ్వల  సంస్థ బాధ్యులు పూర్ణచంద్ర, పలువురు, కౌన్సిలర్లు వావిలాల కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

Related posts

కాలుష్యంతో నిండిపోయిన దూలపల్లి తుమ్మర్ చెరువు

Bhavani

చైనా సరిహద్దులోకి సింహం వచ్చింది

Satyam NEWS

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తాహాసిల్దార్లు శ్రద్ధ చూపాలి

Satyam NEWS

Leave a Comment