38.2 C
Hyderabad
April 29, 2024 21: 31 PM
Slider నల్గొండ

కార్మిక దినోత్సవం మేడే విజయవంతం చేయాలి

#mayday

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో సోమవారం ఐ ఎన్ టి యు సి,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశం ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్,పిసిసి సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మే 1వ,తేదీన జరిగే మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,ఇట్టి కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,పిసిసి ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథులుగా ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు.

ఐ ఎన్ టి యు సి అనుబంధ సంఘాలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ పార్టీ నేతలు,ఎన్ ఎస్ యు,పట్టణ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు,కార్యకర్తలు మేడే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుంటిక కరుణాకర్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు,జిల్లా కార్యదర్శి చింతకాయల రాము,సహాయక కార్యదర్శి సలిగంటి జానయ్య,ఐ ఎన్ టి యు సి పట్టణ ప్రధాన కార్యదర్శి పోతనబోయిన రామ్మూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గొట్టేముక్కల రాము,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్,పట్టణ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడపంగు రాము,ఆర్టీసీ నాయకుడు బాణోతు సైదానాయక్,డక్కన్ సిమెంట్ యూనియన్ కార్యదర్శి హనుమ రాజు,ఐ ఎన్ టి యు సి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ, మహిళా నాయకురాలు శివపార్వతి, ఎన్ ఎ టి ఎల్ పవర్ ప్లాంట్ కార్యదర్శి కోటిరెడ్డి,ఐ ఎన్ టి యు సి పాలకుడు మండల అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్,ఆటో యూనియన్ నాయకుడు కస్తాల రవీందర్,సివిల్ సప్లై యూనియన్ అధ్యక్షుడు తోటా లక్ష్మయ్య, జాన్ సైదా,సిహెచ్ నరేష్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోటయ్య,ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఆకారపు సుదర్శన్, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు కస్తాల సైదులు, కాంగ్రెస్ పార్టీ బూరుగడ్డ శాఖ అధ్యక్షుడు యర్రగాని బిక్షం,కోట మల్లయ్య, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు పాలకూరి లాలు,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ ఉద్దండు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

రవాణా శాఖ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష

Bhavani

శ్రీచైతన్య ,నారాయణ పై ఆదాయపు పన్ను శాఖ దాడి

Satyam NEWS

డాక్టర్ యం.వి.రమణారెడ్డి ఆకస్మిక మృతి తీరనిలోటు

Satyam NEWS

Leave a Comment