30.7 C
Hyderabad
April 29, 2024 05: 46 AM
Slider ఖమ్మం

మైనింగ్ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

#MLA Sandra Venkata

సింగరేణి మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి అధికారులతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సింగరేణి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.

ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ను ప్రజల అవసరార్థం వినియోగంలోకి తేవాలన్నారు. యాతాలకుంట నుండి కిష్టారం వెళ్లే దారిలో హై లెవల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సింగరేణి మైనింగ్ లో పేలుడు ప్రభావంతో నష్టపోయిన ఇండ్ల సర్వే చేపట్టి వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. పునరావాస కాలని, సింగరేణి క్వార్టర్స్ దగ్గర వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు రహదారి గురించి చర్యలు చేపట్టాలన్నారు.

కిష్టారం లోని చెరువులకు వర్షాధారంతో నీరు వచ్చే వనరులు మైనింగ్ తో దెబ్బతిన్నందువల్ల అట్టి చేరువులకు నీరు చేరే మార్గం గురించి కార్యాచరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో సింగరేణి జిఎం జే. రమేష్, కల్లూరు ఆర్డీవో సిహెచ్.

సూర్యనారాయణ, ఏడి మైనింగ్ సంజయ్ కుమార్, సత్తుపల్లి ఏసీపీ రామానుజం, తహసీల్దార్ శ్రీనివాసరావు, మునిసిపల్ కమీషనర్ సుజాత, సింగరేణి పీవో వెంకటాచారి, ఇర్రిగేషన్ ఇఇ శ్రీనివాస రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీచర్స్ డే సందర్భంగా “గురువు”లకు గిప్ట్..!

Satyam NEWS

శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం

Bhavani

జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్‌.పి.ల‌తో నూతన ఎస్ ఇ సి వీడియో కాన్ఫ‌రెన్స్

Satyam NEWS

Leave a Comment