39.2 C
Hyderabad
May 3, 2024 14: 50 PM
Slider ముఖ్యంశాలు

జీవితాన్ని నేర్పేది గురువు: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

#pocharam

తల్లి జన్మనిస్తే తండ్రి నడక నేర్పిస్తాడని, కానీ జీవితాన్ని నేర్పేది మాత్రం గురువేనని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ.. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఉత్తమ సమాజాన్ని తయారు చేసేది గురువు మాత్రమేనని తెలిపారు. చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచామని దానికి పునాది ఉపాధ్యాయుడేనని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలలు ఉన్నాయని, ఇందులో 37 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దేది గురువేనని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ పుట్టిన రోజుకు రెండున్నర లక్షల మొక్కలు

Satyam NEWS

జాతిపిత గాంధీకి ఘన నివాళి

Satyam NEWS

ఓ మహిళా నీకు వందనం

Satyam NEWS

Leave a Comment