26.7 C
Hyderabad
April 27, 2024 08: 53 AM
Slider విజయనగరం

మహిళలకు సంబంధించిన కేసులు 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి

#deepika patil

విజయనగరం జిల్లా ఎస్పీ తొలిసారిగా నగరంలో దండుమారమ్మ టెంపుల్ లో సీఐ స్థాయి అధికారులతో   నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ – మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పోలీసు అధికారులు స్పందించాలని, సంఘటనా స్థలంకు చేరుకొని, విచారణ చేపట్టాలన్నారు. ఈ తరహా నేరాల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.

పోక్సో, రేప్ కేసుల్లో అరెస్టు కాబడిన నిందితులపై హిస్టరీ షీటులు ప్రారంభించాలని, వారు నివసిస్తున్న ప్రాంతాలను మ్యాపింగు చేయాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారు పోలీసులను ఆశ్రయించుటకు గల కారణాలను తెలుసుకొని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు.

నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై చర్యలు చేపట్టడంతోపాటు, ప్రమాదాలకు కారణమవుతున్న వాతావరణ పరిస్థితులను కూడా కేసు డైరీల్లో నమోదు చేయాలన్నారు. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటికి రెండువైపుల కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

దొంగతనాలను నియంత్రించేందు కు పాత నేరస్థులపై నిఘా పెంచాలని, వారి జీవన విధానాలు తెలుసుకొనేందుకు మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో గస్తీ తిరిగే విధంగా రాత్రి బీటుల్లో మార్పులు చేయాలన్నారు. జైళ్ళు నుండి విడుదలవుతున్న నేరస్థుల కదలికలపై నిఘాను పెంచాలని, నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచి పెట్టేందుకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఆస్తికి సంబంధించి శిక్షింపబడిన నేరస్థులపై తప్పనిసరిగా హిస్టరీ షీటులు తెరచి, వారిపై నిఘా పెట్టాలన్నారు. కుటుంబ తగాదాలను, భార్య, భర్తల తగాదాలను పరిష్కరించేందుకు ఒన్ స్టాప్ సెంటర్, మహిళా పోలీసులు, మహిళా రక్షక్ బృందాల సహాయంతో కౌన్సిలింగు నిర్వహించాలన్నారు. సైబరు నేరాలను నియంత్రించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పోలీసుల సహకారంతో అవగాహన కార్యాక్రమాలు చేపట్టా లన్నారు.

కోర్టుల్లో ప్రాసిక్యూషను కేసులను త్వరితగతిన విచారణ జరిపించేందకు ఎన్ బి డబ్ల్యులను ఎగ్జిక్యూట్ చేయాలని, సమన్లును సకాలంలో అమలు చేయాలని, లోక్ అదాలత్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

అదృశ్యం కేసులు, అనుమానస్పద మృతి కేసుల్లో ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా త్వరితగతిన దర్యాప్తులు పూర్తి చెయ్యాలన్నారు. కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసేటప్పుడు డాక్యుమెంట్లు జాబితాతోపాటు సాక్ష్యాలుగా వినియోగించే ఫోటోలు, సిడిలు, ఆయుధాల వివరాలను తప్పనిసరిగా జత చేయాలన్నారు. కేసుల దర్యాప్తు లో స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎటువంటి ఆలస్యం లేకుండా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలన్నారు.

అనంతరం, దర్యాప్తులో ఉన్న తీవ్ర నేరాలను జిల్లా ఎస్పీ స్వయంగా సమీక్షించి, దర్యాప్తులను పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు దర్యాప్తులను పూర్తి చేసేందుకు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ దిశానిర్దేశం చేసారు. ప్రజలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించుటలోను, యాప్ డౌన్లోడు చేయించుటలోను, అసాంఘిక శక్తుల సమాచారంను అందించుటలో క్రియాశీలకంగా పని చేసిన మహిళా పోలీసులను, ఇటీవల నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన కోర్టు కానిస్టేబుళ్ళు, హెచ్ సిలు మరియు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు, విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశా డీఎస్పీ టి. త్రినాధ్, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, డీపీఓ ఎఓ వెంకట రమణ, న్యాయ సలహాదారులు పరశురాం, సీఐలు బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, రుద్రశేఖర్, డి.రమేష్, జె.మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, సిహెచ్. లక్ష్మణరావు, టిఎస్ మంగవేణి, శ్రీధర్, జి.సంజీవరావు, ఎస్.సింహాద్రినాయుడు, శోభన్ బాబు, విజయానంద్, బాల సూర్యారావు, ఈ నర్సింహమూర్తి, టివి తిరుపతిరావు, ఏసీపీలు కె.సూర్య ప్రకాశరావు, శ్రీనివాస పట్నాయక్, కేశవరావు, వివిధ పోలీసు స్టేషన్ లలో  పని చేస్తున్న సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

సర్పంచ్‌లకు వై ఎస్ జగన్ ప్రభుత్వం ‘స్వాతంత్య్ర’ ఝలక్

Satyam NEWS

రైతులకు దారి ఇవ్వాలి

Sub Editor

లోటస్ ఫీడ్ ది నీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నఅన్నదానం

Satyam NEWS

Leave a Comment