31.2 C
Hyderabad
May 2, 2024 23: 33 PM
Slider ముఖ్యంశాలు

నాగర్ కర్నూల్ లో మెగా వైద్య శిబిరం ప్రారంభం

#megahealthcamp

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి ప్రజలను కోరారు. 

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆరోగ్య శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్తుపత్రిలో ఏర్పాటు చేసిన  మెగా హెల్త్ మేళా  కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు పి. రాములు, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవం చేసారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకొని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా తెలుసుకొని వైద్యం చేయించుకోవాలని సూచించారు.  ఈ రోజు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ మేలా నిర్వహించడం జరిగిందని, 19 వ తేదిన కల్వకుర్తి సి.హెచ్.సి. లో, 21 న అచ్చంపేట, 22న కొల్లాపూర్ సి.హెచ్.సి. లో మెగా హెల్త్ మేలా  నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చిన రోగులకు వైద్య సిబ్బంది కసురుకోకుండా ఓపికగా చూసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.  జిల్లా ప్రజలు ఈ మెగా హెల్త్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు

కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న మెగా హెల్త్ మేళా క్యంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  వైద్యానికి పెద్ద పీట వేస్తూ  రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకో మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో వైద్య కళాశాల మంజూరు అయ్యాక ఆసుపత్రి రూపురేఖలు మారిపోతున్నయన్నారు.

వివిధ విభాగాల్లో  నిష్ణాతులైన డాక్టర్లు మౌళిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

ఈ మెగా హెల్త్ మేళాకు హాజరైన స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా నిరక్షరాస్యులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్న జిల్లా అని మెగా హెల్త్ మేళాకు వచ్చే వారికి వైద్య పరిక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. 

అదేవిధంగా గ్రామిణ ప్రాంత ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుబ్రత, ఏ వ్యాధి ఎందుకు వస్తుంది వాటిని నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని తెలియజేసారు. పవిత్ర డాక్టరు వృత్తిలో ఉన్న వారు తమ వ్రుత్తి ధర్మాన్ని పాటించి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యెక ద్రుష్టి సారించి వైద్యానికి వచ్చే గ్రామిన ప్రజలకు సరైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

మెగా హెల్త్ క్యాంప్ లో కేసీఆర్ కిట్ల పంపిణీ

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా హెల్త్ మేళా లో కే.సి.ఆర్. కిట్, బి.పి, షుగర్ వంటి జనరల్ పరీక్షలతో పాటు  కంటి చికిత్స, దంత వైద్యం, కేన్సర్ వంటి రోగాల నిర్ధారణతో పాటు ఉచిత వైద్యం, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.  అలోపతి వైద్యం తో పాటు ఆయుర్వేద, యునాని, హోమియో చికిత్సలు సైతం ఉచితంగా అందించే ఈ మెగా హెల్త్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

త్వరలోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి, జిల్లాలో రక్త నిధిని పరిపుష్టం చేయడం జరుగుతుందన్నారు.  అనంతరం జిల్లా కలెక్టర్ హెల్త్ మేళాను పరిశీలించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుచున్న మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారికి కవలసిన మౌలిక సదుపాయాల పై అధికారులకు తగు సూచనలు చేసారు.

ఈ మెగా హెల్త్ మేళా లో మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబు  రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్,  మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జిల్లా  ఆసుపత్రి సుపరిందేంట్  డా. శివరాం, జనరల్ ఆసుపత్రి సుపరిన్దేంట్ రఘు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, నాగర్ కర్నూల్

Related posts

పటిష్ట నిఘా

Murali Krishna

రామంతపూర్ చిన్న చెరువు దుర్వాసన అరికట్టండి

Satyam NEWS

షర్మిలా రెడ్డి కి గులాబి నేతల రక్షణ కవచం

Satyam NEWS

Leave a Comment