42.2 C
Hyderabad
May 3, 2024 16: 23 PM
Slider నల్గొండ

కరోనా ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలి

#Kodada RDO

తెలంగాణలో కరోన వైరస్ విలయ తాండవం చేస్తున్నదని, ఈ కారణంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి. అజీజ్ పాషా ఆరోపించారు. ఈ మేరకు ఆయన కోదాడ R D 0 కిషోర్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. కరోనా సోకితే చికిత్స చేయుంచుకోవడానికి ప్రజలకు ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుందని అజీజ్ పాషా అన్నారు.

అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కారోనా  వైద్య చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోన టెస్టింగ్ సెంటర్లు జిల్లా కేంద్రంలో తక్షణమే ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఇంటింటికి ర్యాండమ్  కిట్ల  ద్వారా ప్రతి ఇంటికి కరోనా టెస్టులు నిర్వహించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ హాస్పటల్స్ లో డాక్టర్లందరికీ సిబ్బందికి పి.పి.ఇ కిట్లు, యన్ 95 మాస్కులు ఇవ్వాలని కోరారు

అదే విధంగా అన్ని ఆసుపత్రుల్లో వెంటిలేటర్స్, ఐసియు బెడ్స్ ను తక్షణమే ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ కు తొత్తుగా మారిందని అందుకే కరొనా టెస్టులు చేయటానికి, వైద్యం అందించటానికి రేట్లు నిర్ణయించి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని అన్నారు.

టెస్టులు వైద్య చికిత్సలు ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముశం సత్యనారాయణ, ఎస్ కె బిక్కన్ సాహెబ్, దొంతగాని జగన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

Satyam NEWS

ఎక్స్టెండెడ్:ఏప్రిల్‌ 30 వరకు ఫ్రీ వీసా పథకం

Satyam NEWS

ఘనంగా సోనియా గాంధీ 74 వ జన్మదినోత్సవం

Satyam NEWS

Leave a Comment