33.7 C
Hyderabad
April 29, 2024 01: 41 AM
Slider ముఖ్యంశాలు

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

#revanthreddy

గౌడ గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని  టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి కి ములుగు జిల్లా నర్సాపూర్ వెంకటాపూర్ మండలం పరిధిలో గౌడ గీతకారులు వినతి పత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం గౌడ్ సంఘాల ఐక్య వేదిక గౌడ జేఏసీ జాక్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కి వినతి పత్రం నర్సాపూర్ వద్ద ఇవ్వడం జరిగినది.

అనంతరం గౌడ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు ముంజల బిక్షపతి గౌడ్ గౌడ జేఏసీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్నే పల్లి కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూనూర్ అశోక్ గౌడ్ గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు గుండెబోయిన బిక్షపతి గౌడ్ గౌడ యూత్ జేఏసీ రాష్ట్ర నాయకులు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ తమ సమస్యలను వివరించారు.

ములుగు ఏజెన్సీ లో గౌడ గీత కార్మికులకు సొసైటీ పునరుద్ధరించాలని ఏజెన్సీలో సొసైటీలు రద్దు బాధాకరమైన విషయమని వారు అన్నారు. ఏజెన్సీలో గౌడులు చెట్టు మీద నుంచి పడి చనిపోతే పరిహారం రావడం లేదని అన్నారు. తాటి చెట్టు పైనుండి పడి మృతిచెందిన గౌడ కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముంజల బిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. పూర్తిగా అంగవైకల్యం చెందినవారికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని దెబ్బలు తగిలిన వారికి రూ.లక్ష ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గీత కార్పొరేషన్ ఏర్పాటుచేసి బడ్జెట్లో 5000 వేల కోట్లు కేటాయించాలని గీత కార్పొరేషన్ చైర్మన్ వెంటనే నియమించాలని గౌడ గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఉచితంగా ఇవ్వాలని తాటి ఈత చెట్ల పెంపకానికి కై ప్రతి గౌడ సొసైటీ కి 5 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. ప్రతి గౌడ కార్మికునికి ఆసరా పింఛన్ కాకుండా గౌడ గీత వృత్తి పింఛన్ 5000 ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

ప్రతి సొసైటీకి కమ్యూనిటీ హాల్ ప్రతి జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మించాలని ముంజల బిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ గీత వృత్తి ప్రమాదంలో మృతి చెందిన గౌడ గీత కార్మిక కుటుంబంలోని పిల్లలకు ఉచిత విద్య వైద్యం అందించాలని గౌడ జేఏసీ ములుగు జిల్లా కమిటీ వినతిపత్రం ఇవ్వడం జరిగినది. బహుజన యోధుడు జాతి ఆత్మగౌరవ ముద్దుబిడ్డ పోరాటయోధుడు  సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు తమ వంతు సహకరించాలని కోరారు.

Related posts

Demand: రైతులందరికి ఖరీఫ్ పంటకు ఋణాలివ్వాలి

Satyam NEWS

ధర పెరిగితే ఏం? నేను ఉల్లి తిననుగా

Satyam NEWS

బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు

Bhavani

Leave a Comment