40.2 C
Hyderabad
April 28, 2024 16: 58 PM
Slider

బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు

#BC Post Matric

రాష్ట్రంలో బిసి విద్యా సంబంధిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రీయంబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు జీవో విడుదల, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్ క్రిష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ఈ మేరకు కరీంనగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి వెల్లడించారు. విద్యనే అన్నింటికి మూలమని, సామాజిక సమానత్వం విద్యతోనే సాధ్యమనే గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి బిసిలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నిన్ననే తెలంగాణ బిసి బిడ్డలకు జాతీయ స్థాయిలోని నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర 200కు పైగా విద్యాసంస్థల్లో బిసి విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ అందజేసే పథకాన్ని ప్రకటించుకున్నామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ అందిస్తుందన్నారు, రాష్ట్రంలోని 401 ప్రీమెట్రిక్ హాస్టళ్లోని 30,732 మంది విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు సైతం సంపూర్ణ వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34వేలకు పైగా బిసి విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి భోజన, వసతితో పాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, వులన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.

గతంలో భోజన, వసతి మాత్రమే అందజేసేవాళ్లమని, నేటి నిర్ణయంతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసించి రాష్ట్రం పేరును నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన రైతుబందు, ఆసరా పించన్లు, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మీ వంటి పథకాల్లో మెజార్టీ వాటా అందజేయడంతో పాటు, కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువ గల స్థలాల్లో 42కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, కుల వృత్తుల పునర్‌వైభవానికి ఆర్థిక సాయం,

గతంలో కేవలం 19 గురుకులాల నుండి 327 గురుకులాలకు పెంచి 152 పదో తరగతి వరకూ, 142 ఇంటర్ వరకూ 33 డిగ్రీ కాలేజీలు ద్వారా 1,87,230 మంది విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్పులు తదితర ఎన్నో పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హార్డ్ స్టోరీ: కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి

Satyam NEWS

నిరుత్సాహం వద్దు భవిష్యత్తు మనదే

Satyam NEWS

జగన్ కు లేఖ రాయండి: డ్రాఫ్ట్ లెటర్ ఇచ్చిన రఘురామ

Satyam NEWS

Leave a Comment