40.2 C
Hyderabad
April 29, 2024 17: 54 PM
Slider ప్రత్యేకం

మహిళా దినోత్సవం సందర్భంగా 50 వేల మందితో మానవహారం

#womensday

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 వ తేదీన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 50 వేల మంది మహిళలతో మానవ హారం నిర్వహింహనున్నట్లు  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   లో తెలిపారు. ” బాల్య  వివాహాలను రూపుమాపుదాం – టీనేజ్ ప్రేగ్నన్సిని అరికడదాం” అనే నినాదం తో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

మానవహారం ఉదయం 8.30 నుండి 9.30 వరకు గంట పాటు నిర్వహించడం జరుగుతుందని, బాల్య వివాహాల నిరోధం, ఎర్లీ మారేజేస్ , టీనేజ్ ప్రగ్నన్సి  పై ప్ల కార్డులు, నినాదాల తో మానవ హారం లో పాల్గొంటారని తెలిపారు.  ఈ మానవహారం కలెక్టరేట్ వద్దగల ఎన్.టి.ఆర్ విగ్రహం నుండి ఆర్ అండ్ బి , ఆర్.టి.సి కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐసు ఫ్యాక్టరీ , దాసన్నపేట , కోట జంక్షన్ , సింహాచలం మేడ , ఆనంద గజపతి ఆడిటోరియం  వరకు కొనసాగుతుందని తెలిపారు.

అనంతరం 10 గంటలకు ఆనంద గజపతి ఆడిటోరియం లో పలు కార్యక్రమలు, ప్రముఖ వక్తల సందేశాలు ఉంటాయని తెలిపారు.  ఈ మానవ హారం లో డ్వాక్రా మహిళలు, సఖి బృందాల సభ్యులు, వాలంటీర్లు ,  కళాశాల విద్యార్ధులు, సచివాలయాల సిబ్బంది, స్వచంద  సంస్థల సభ్యులు పాల్గొంటారని తెలిపారు. 

ఐ.సి.డి.ఎస్., జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డి.ఆర్.డి.ఎ , మున్సిపల్ కమీషనర్, మెప్మ  శాఖల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని,  మహిళలంతా పెద్ద  ఎత్తున పాల్గొని ఈ మానవహారాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.  జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా తగ్గించేలా, టీనేజ్ ప్రగ్నేన్సి లేకుండా చేయాలనీ , తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండే సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేసేలా అవగాహన కలిగించడం ఈ కార్యక్రమాల  ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేసారు.

Related posts

ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గుండెపోటుతో మృతి

Satyam NEWS

భారీ వర్షానికి కొట్టుకు పోయిన బదరీనాథ్ హైవే

Satyam NEWS

కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం

Satyam NEWS

Leave a Comment