33.7 C
Hyderabad
April 28, 2024 23: 35 PM
Slider వరంగల్

నిజాయితీగా వ్యాపారం చేయకపోతే చర్యలు

#Commissioner Ranganadh

నిజాయితీగా వ్యాపారం చేయండిలేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాధ్ పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు. ట్రై సిటీ పరిధిలోని పాత సామాను కోనుగోలు వ్యాపారస్థులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వహకులతో భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో పోలీస్ కమీషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ముందుగా పోలీస్ కమిషనర్ చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జరిగే నష్టంతో పాటు, దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ వ్యాపారస్తులకు వివరించారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైనయిన వాహనాల కొనుగోలు చేయడం సరికాదని, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అధికంగా వినియోగించే ద్విచక్ర వాహనాన్ని దొంగల నుండి కోనుగోలు చేసి వాటిని తుక్కు రూపంలో తరలించడం మానుకోవాలని తెలిపారు.

పాత ఇనుప సామాను, సెకండ్ హ్యాండ్ వాహన విక్రయ వ్యాపారస్థులు ముఖ్యంగా ఏదైన వాహనం కొనుగోలు చేసే సమయంలో తప్పని సరిగా వాహనం విక్రయించే వ్యక్తులకు సంబంధించి ఆధార్ లాంటి గుర్తింపు కార్డులతో పాటు, వారి సెల్‌ఫోన్ నంబర్ తీసుకోవాలని చెప్పారు. వాహనాల క్రయ విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటిస్తూ, రికార్డులను రూపోందించుకోవాలని, ముఖ్యంగా ఒరిజినల్ పత్రాలు ఉంటేనే వాహనాలను కొనుగోలు చేయాలని, ప్రతి వ్యాపార కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఎవరైన వ్యాపారస్తులు చట్టవ్యతిరేకంగా వాహన కొనుగోలుకు పాల్పడితే వ్యాపాస్థులపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీలు మల్లయ్య, రమేష్ కుమార్, కిరణ్ కుమార్, డేవిడ్ రాజు, సతీష్ బాబుతో పాటు ఎస్ఐలు పాల్గోన్నారు.

Related posts

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జగన్ కుట్ర

Satyam NEWS

మై గాడ్: ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎగిరిపోయిన చిలుక

Satyam NEWS

ఇంద్రకీలాద్రిలో దసరా మహోత్సవాల కరపత్రం విడుదల

Satyam NEWS

Leave a Comment