40.2 C
Hyderabad
May 2, 2024 16: 48 PM
Slider నల్గొండ

కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత,కనీస వేతనం అమలు చేయాలి

#citu

సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలం రాంపురం సిమెంట్ పరిశ్రమలలో నుటికి 70 నుంచి 80 శాతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి బోనస్, గ్రాడ్యుటీ,ఉద్యోగ భద్రత లేదని,కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి తీవ్రంగా ఆరోపించారు.

పరిశ్రమలలో సర్వేలో భాగంగా శనివారం రాంపురం ప్రియా సిమెంట్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికుల సర్వే సందర్భంగా రోషపతి మాట్లాడుతూ కార్మికుల నుండి అనే విషయాలు తెలిపారని అన్నారు.ఒక పరిశ్రమ లాభంతో నడుస్తున్నప్పుడు అందులో శ్రమ చేసే శ్రమజీవులకి ఏజ్ బోర్డ్ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణతో తీసుకొచ్చిన కార్మిక కోడ్ లతో బానిసత్వంలోకి నెట్టే కార్మిక కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు.

కార్మికుల సర్వే ద్వారా వచ్చిన సమస్యలపై చలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఈనెల 26న,పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఆదాయం పన్ను పరిధిలోకి రాని ప్రతి కుటుంబానికి ప్రతి నెల 7,500 రూపాయలు ఇవ్వాలని, కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణపట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సభ్యులు తీగల శ్రీను, నాగేశ్వరరావు, గిరి,ప్రకాష్, అజాముద్దీన్, రామకృష్ణ, నాగేశ్వరావు,లక్ష్మయ్య, అంకారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న కార్మిక సంఘాలు

Satyam NEWS

మంత్రి మల్లారెడ్డిపై భూఆక్రమణ కేసు నమోదు!

Sub Editor

అంబర్ పేట్ జర్నలిస్టుల సంఘానికి సీనియర్ల మద్దతు

Satyam NEWS

Leave a Comment