26.7 C
Hyderabad
May 3, 2024 10: 52 AM
Slider విశాఖపట్నం

టీడీపీ “బాధ‌లే బాధ‌ల” కోసం ఆ పార్టీ అధ్య‌క్షుడు బాబు ప‌ర్య‌ట‌న‌లు…!

#ministeramarnath

రాష్ట్రంలో గ‌డ‌చిన కొద్ది రోజుల నుంచీ ప్ర‌తిప‌క్ష పార్టీ పెరిగిన ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ…బాదుడే బాదుడు అంటూవినూత్నంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. తాజాగా పార్టీ ఆధ్వ‌ర్యంలో టీఎన్ఎస్.ఎస్ ..టెన్త్ ప‌రీక్షా లీకేజీల‌పై ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టింది.

ఇదిలా ఉంటే జ‌గన్ ప్ర‌భుత్వ…ఉగాది నుంచీ కొత్త జిల్లాల ఏర్పాటుకుశ్రీకారం చుట్టిన సంగ‌తికూడా వీక్ష‌కుల‌కు తెలిసిందే. అందులో భాగంగా కొత్త‌గా ఏర్ప‌డ్డ జిల్లాల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంచార్జ్ మంత్రుల‌ను నియ‌మిచింది.ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ఉత్తారంధ్ర‌లో కొత్త‌గా ఏర్ప‌డ్డ పార్వ‌తీపురం-మ‌న్యం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా గుడివాడ అమర్ నాధ్ రెడ్డి ని ప్ర‌భుత్వం నియ‌మించిన సంద‌ర్బఃంలో ఆ జిల్లాకు వెళుతూ…విజ‌య‌న‌గ‌రం జిల్లాక‌లెక్ట‌రేట్ లోని వీడియో కాన్ఫ‌రెన్స్ సీఎం జ‌గ‌న్ వ‌స‌తి దీవ‌న కార్య‌క్ర‌మానికి కొద్దిసేపు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌రేట్ క్యారిడార్ లో మీడియా తో మాట్లాడారు. తమ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌ధ‌కాల గురించి తెలుపుతూ ప్రతిప‌క్ష పార్టీ చంద్ర‌బాబు ఉత్తరాంధ్ర ప‌ర్య‌ట‌న గురించి ప్ర‌స్తావించారు.చంద్ర బాబు బ‌తికి ఉన్నంత కాలం…టీడీపీ అదికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌న్న విష‌యం ఆయ‌న గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

రాష్ట్రంలో టీడీపీ మ‌నుగ‌డ క‌నుమ‌రుగైపోయింద‌న్నారు.ఆ పార్టీ చేప‌ట్టిన బాదుడే బాదుడుకు బదుల‌..బాధ‌లే బాధ‌లు అన్న కార్యక్ర‌మం కోస‌మే… ప్ర‌తిప‌క్ష నేతు బాబు ఉత్త‌రాంధ్ర‌లోకి శ్రీకాకుళంలో ప‌ర్య‌టించార‌ని మంత్రి అమ‌ర్ నాధ్ అన్నారు..మూడేళ్ల త‌ర్వాత ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర‌కువ‌చ్చార‌ని..ఏ ముఖం పెట్టుకుని ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని మంత్రి అమ‌ర్ నాధ్ విమ‌ర్శించారు.

పార్టీని న‌డిపించ‌లేక ఆయ‌న‌,ఆయ‌న కొడుకు ప‌డుతున్న‌బాధ‌ల కోసం..ఆ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని మా పార్టీ అభిప్రాయ‌మ‌న్నారు.2014 నుంచీ 2019 వ‌ర‌కురేట్టు ఎందుకు పెరిగాయో చెప్పాల‌ని మంత్రి అన్నారు.చంద్ర బాబు బ‌తికి ఉన్నంత కాలం…అదికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌న్న విష‌యం ఆయ‌న గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

మంత్రి తోపాటు డిప్యూటీ సీఎం ,గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి రాజ‌న్న దొర‌,రాజాం ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ సూర్య‌నారాయ‌ణ‌రాజు,జేడ్పీ చైర్మ‌న్ ఎం.శ్రీనివాస‌రావు లు కూడా ఉన్నారు.

Related posts

పంతుళ్ల పై పగ: ఎన్నికల విధుల నుంచి అవుట్

Satyam NEWS

గత ఏడాది తండ్రిని గమ్యం చేర్చి:సైకిల్ గర్ల్ జ్యోతి తండ్రి మృతి

Satyam NEWS

స్టాప్ నర్సు పోస్టులు,ఏ.ఎన్.ఎం పోస్టులు వెంటనే భర్తీ చేయండి

Satyam NEWS

Leave a Comment