31.7 C
Hyderabad
May 2, 2024 10: 06 AM
Slider చిత్తూరు

సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం

#ministerroja

విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ఏకిపారేశారామె.

‘‘ప్రతీ పేద విద్యార్థి తాను కలలు గన్న చదువు అందుకుని.. ఆ కుటుంబాన్ని పైకి తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చినా జగనన్నకు కృతజ్ఞతలు. ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం విద్యాదీవెన. పేదోడంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదు. అందుకే అన్నిరకాలుగా నరకయాతన పెట్టాడు. కానీ, మనసున్న మహరాజు జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రతీరోజూ సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి విద్యార్థుల అదృష్టం.. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం అన్నారు మంత్రి రోజా.

అన్నం పెట్టిన జగనన్న, ఆసరా ఇచ్చిన జగనన్న, చదువు అందించిన జగనన్న, ఆనందం పంచిన జగనన్న, అన్నదాతలకు అండగా ఉన్న జగనన్న.. ఈ ప్రశంసలేవీ చంద్రబాబుకు సహించడం లేదు. కరువుకు ప్యాంట్‌ షర్ట్‌ వేస్తే అది చంద్రబాబే. అందుకే ఇవాళ సిగ్గులేకుండా బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ, సీఎం జగన్‌ పేదలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వయసు తేడా లేకుండా.. కుల, వర్గాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు.

బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేస్తున్న తెలుగు దేశం పార్టీని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బాది పంపించారు. వాళ్ల వ్యవహారం ఇలాగే కొనసాగితే.. 2024లోనూ చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదని సీఎం రోజా చెప్పారు. అవినీతికి తావు లేకుండా పాలిస్తున్న సీఎం జగన్‌.. .మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం ఈరోజు రాష్ట్రం కోసం పిల్లల కోసం ఓ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కావాలనుకున్నారని, ఇది ఆయన పెద్ద మనుసుకు నిదర్శమని అన్నారు మంత్రి రోజా

Related posts

ఐ.టి.ఐ అప్రెంటీస్ లకు జాబ్ మేళా

Satyam NEWS

ఎల్లోమీడియాకు బ్రెయిన్ ఫీవర్

Satyam NEWS

అక్టోబ‌రు 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

Leave a Comment