26.7 C
Hyderabad
May 3, 2024 09: 54 AM
Slider ఆంధ్రప్రదేశ్

బిజెపి జనసేన నేతలపై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి

#Minister Vellampally Srinivas

తిరుపతికి చెందిన బిజెపి నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మేందుకు అప్పటిలో తీర్మానం చేసిన వ్యక్తి అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకంపై వ్యాఖ్యానాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

అప్పుడు ఆస్తుల అమ్మకంపై బోర్డు సభ్యుడుగా సంతకం చేసిన భాను ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు 40 దేవాలయాలు కూల్చేసినప్పుడు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదని కూడా మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.

అప్పట్లో తాను బీజేపీ లో ఉండి దేవాలయాలు పడగొట్టే అంశాన్ని అడ్డుకుంటే తనను అరెస్ట్ చేశారని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోతే కన్నా ఎందుకు మాట్లాడట లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులకి అమ్ముడు పోయి కన్నా మాట్లాడటం లేదని ఆయన అన్నారు.

మీరు అమ్మాలనుకున్న ఆస్తులని జగన్మోహన్ రెడ్డి ఆపితే మీరు నిరాహార దీక్ష చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేవాలయాల డబ్బులు తీసుకుని వెళ్లి ఇమామ్ లకి,పాస్టర్ లకి ఇస్తున్నారన్న దుష్ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి అన్నారు. పవన్ కళ్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారు..చేతిలో దేవుడి పటం ఉంటుంది..వీళ్ళు కూడా టీటీడీ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు..అంటూ మంత్రి నిరసన వ్యక్తం చేశారు.

Related posts

అభివృద్ధి సంక్షేమమే మా ప్రచారాస్త్రం

Sub Editor

సీఎం జగన్ ఏ పని చెప్పినా చేస్తా

Bhavani

ఎస్సై నుండి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించిన స్వాతి

Bhavani

Leave a Comment