33.7 C
Hyderabad
April 29, 2024 02: 00 AM
Slider మెదక్

డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

#Medical Health Minister Tanniru Harish Rao

మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు పర్యటించారు. రామాయంపేట లో 250 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తో బాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏగ్గే మల్లేశం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కు గజమాలతో ఘనంగా సన్మానం చేశారు.

మేళతాళాలు, సన్నాయి, మంగళ హారతులతో మంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లకు లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి మంత్రి హరీష్ రావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవం రాం జయంతి రోజు ఇళ్లలోకి వెళ్లడం అభినందనీయం.

సీఎం కేసీఆర్ దళిత వర్గాల కోసం దళిత బంధు,ఎస్సిఎస్టీ సబ్ ప్లాన్ పథకాలు ప్రవేశ పెట్టాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ 60 వేలు ఇస్తే 40 వేలు అప్పు కింద ఇచ్చేది. రూపాయి ఖర్చు లేకుండా రూ 15 లక్షల విలువగల ఇళ్లు ఇస్తున్నాం అని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద అంగన్ వాడి,రేషన్ షాపు ఇవ్వమని కలెక్టర్ కు చెప్పాను. ఈ నెలలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తాం. రామయంపేట అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. కల్యాణ లక్ష్మీ,గృహ లక్ష్మీ తదితర పథకాలు మహిళలకు పెట్టాం. ఇంటింటికి నీళ్లు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.

Related posts

నేరస్తులకు శిక్ష వేయించడంతో నాగర్ కర్నూల్ టాప్

Satyam NEWS

కరోనా కరోనా: నోరు మూసుకుని పని చేయాల్సిందే

Satyam NEWS

కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి

Satyam NEWS

Leave a Comment