39.2 C
Hyderabad
April 28, 2024 14: 31 PM
Slider ముఖ్యంశాలు

రేపు కామారెడ్డికి కేటీఆర్ రాక: 10 వేల మంది కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

#ktrmeeting

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు ఐటి, పురపాలక శాఖ మంత్రి కామారెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కేటీఆర్ సభకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో మినీ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్నారు. దానితో పాటు ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయడానికే కేటీఆర్ పర్యటన అనే ప్రచారం సాగుతోంది.

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనుండటంతో నెల రోజుల క్రితమే ఎమ్మెల్సీ కవిత బిక్కనూర్ మండల కేంద్రంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కుమారుని వివాహం ఉండటంతో కార్యక్రమం వాయిదా పడింది. దాంతో ఎలాగైనా కార్యకర్తల సమావేశం నిర్వహించాలని చూస్తున్నా ఇప్పటికి కుదిరింది. మరోవైపు కామారెడ్డి బీఆర్ఎస్ లో వర్గపోరు నడుస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఈ సమావేశంలో కార్యకర్తలు, నాయకులను ఏకతాటిపైకి తెచ్చేలా కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.

రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ కామారెడ్డికి రానుండటంతో నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ నేపథ్యంలో రేపటి సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు.. కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనేది ఉత్కంఠగా మారుతోంది.

సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్

రేపు డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. కార్యకర్తలకు సరిపడా సభ ఏర్పాట్లు చేశారు. భోజనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కేటీఆర్ ను కలవనున్న లబాణా నాయకులు..?

గత కొద్దిరోజులుగా తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ లబాణా కాయితి లంబాడీలు ఆందోళనలు చేస్తున్నారు. గత నెల 30 న జిల్లా కేంద్రంలో చేపట్టిన ఏక్తా ర్యాలీ ఉద్రిక్తతల మధ్య కొనసాగడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేకపోతే కేసీఆర్ పై 1016 నామినేషన్స్ వేస్తామని ప్రకటించారు.

మొన్న బాన్సువాడలో కేటీఆర్ సమావేశంలో సైతం లబాణా లంబాడాలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రేపు లబాణా లంబాడాలు మంత్రి కేటీఆర్ ను కలవనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నాయకుల చొరవతో ముఖ్య నాయకులు తమ సమస్యలను మంత్రి కేటీఆర్ కు వివరించనున్నట్టు తెలుస్తోంది.

Related posts

కొండగట్టుకు రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు

Bhavani

సార్వత్రిక సమ్మెలో భాగంగా నరసరావుపేటలో అరెస్టుల పర్వం

Satyam NEWS

`ఓదెల రైల్వేస్టేషన్`లో `స్పూర్తి`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

Leave a Comment