31.7 C
Hyderabad
May 2, 2024 07: 25 AM
Slider చిత్తూరు

వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

#ministerroja

తిరుపతి జిల్లా “వైయస్సార్ వాహనమిత్ర ” 4వ విడత పంపిణీ కార్యక్రమం లో పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు.

ఈరోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తిరుపతి జిల్లా కు సంబంధించిన వైయస్సార్ వాహన మిత్ర నాలుగవ విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతీ పథకం పేదలకోసమే ఆలోచిస్తారని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని అన్నారు.

జగనన్న అంటే…మాట తప్పడు…మడమ తిప్పడు అని ఈరోజు మరో సారి  రుజువైందని ఆమె అన్నారు. జగన్  సీఎం  అయ్యాక…ప్రారంభించిన మొట్ట మొదట పథకం ఈ వైఎస్సార్ వాహన మిత్ర అని మంత్రి రోజా తెలిపారు. ప్రతీ ఏటా ఈ పథకం లబ్ధిదారులు పెరుగుతున్నారు.

అర్హత సాధించిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా  మొత్తం 2 లక్షల 62 వేల  మంది లబ్దిదారులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పధకంలో భాగంగా సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు 10 వేలు చొప్పున  ఆర్థిక సాయం ప్రతీ ఏటా అందిస్తున్నారు.

ఈ నాలుగో విడతలో సుమారు 262 కోట్లను వాహన మిత్ర లబ్ధిదారులకు మన ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2 లక్షల 62 వేల  మంది లబ్ధిదారుల్లో  63 వేల 594  మంది ఎస్సీలు, 1,44,  164 మంది బీసీలు,  10,472  మంది ఎస్టీలలకు లబ్ధి చేకూరిందని మంత్రి రోజా అన్నారు.

మొత్తం లబ్దిదారుల్లో 83 శాతం బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల వారే ఉండటం విశేషమని ఆమె తెలిపారు. కరోనా లాక్ డౌన్ వలన… ఆటో వాళ్లు….ట్యాక్సీ వాళ్లు పడ్డ కష్టాలని….ఈ దేశంలో గుర్తించిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మంత్రి తెలిపారు.

Related posts

పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

ప్రతిరోజు పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలి

Satyam NEWS

ఎలర్ట్: కలసికట్టుగా కరోనా వైరస్ తరిమేద్దాం

Satyam NEWS

Leave a Comment