40.2 C
Hyderabad
April 26, 2024 14: 46 PM
Slider వరంగల్

పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

#MuluguMLASeetakka

మునిగిన వరి పంట పొలాలు పత్తి చేనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు పరిశీలించారు. ఆమె తోబాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ రోజు ములుగు మండలం పాల్సాబ్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క పత్తి పంట ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాల వలన ములుగు ప్రాంతం లో పంట పొలాలు పత్తి చేనులు పూర్తిగా నీట మునిగి రైతు కు తీరని దుఖాన్ని మిగుల్చిందని అన్నారు. రామప్ప మత్తడి వెడల్పు లేకపోవడం తో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.

సుమారుగా రాష్ట్రం లో 4లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని, రామప్ప ను రిజర్వుయర్ చేస్తే కనుక మత్తడి వెడల్పు పెంచిన తరువాతనే చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు 30,000వేల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, దేవేందర్ రావు పాల్గొన్నారు.

ఇంకా, వెంకట్ రెడ్డి, తోట వెంకన్న ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి, శేంకర్ మేస్త్రి, చక్రపు రాజు, మైస ప్రభాకర్, తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి కపిల్

Sub Editor

డిస్కనెక్ట్:మాయావతి ఇంటికి విద్యుత్ సరఫరా బంద్

Satyam NEWS

గుంటూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

Satyam NEWS

Leave a Comment