38.2 C
Hyderabad
April 28, 2024 21: 14 PM
Slider రంగారెడ్డి

విద్యా మంత్రికి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం

sabitha gharao

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆమె కు చేదు అనుభవం ఎదురైంది. నేడు మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నందీహిల్స్ చౌరస్తాలో ఉన్న వాటర్ ట్యాంక్ ప్రారంభించడానికి ఆమె వచ్చారు.

ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. నంది హిల్స్ కాలనీలో చాలా కాలంగా డ్రైనేజి సమస్య ఎదుర్కుంటున్నామని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మీరు ఎన్నికలో గెలిచి పార్టీ మారి సంవత్సరం అయింది. ఉత్త హామీలు తప్ప మీరు చేసింది ఏమి లేదు అని పెద్ద ఎత్తున మహిళలు గుమికూడి నిరసన తెలిపారు.

నందీహిల్స్ కాలనీ మహిళలు ఈ విధంగా మంత్రి సబితా ని అడ్డుకొని డ్రైనేజీ సమస్య ను ఇప్పటికి ఇప్పుడే పరిష్కరించాలని ఘెరావ్ చేయడంతో ఒక్క సారిగా మంత్రి నోట మాట రాలేదు. ఇప్పుడే ఇక్కడే సమస్య  పరిష్కరించాలి అని మహిళలు మంత్రి సబిత ను ఘెరావ్ చేసారు. స్పష్టమైన హామీ ఇవ్వాలి అని నిరసన తెలిపారు.

Related posts

కరిగిపోవా..

Satyam NEWS

నరసరావుపేటలో భారీ ఎత్తు రేషన్ బియ్యం స్మగ్లింగ్

Satyam NEWS

టెంట్‌ కనపడితే చాలు ఉడుముల్లాగా చేరిపోతున్నారు!

Satyam NEWS

Leave a Comment