33.7 C
Hyderabad
February 13, 2025 20: 52 PM
Slider జాతీయం

ఉరి శిక్ష అమలు వైపు నకు ఒక్కో అడుగు ముందుకు

supreme court

నిర్భయ దోషుల ఉరిశిక్ష పైపు నకు ఒక్కో అడుగు పడుతున్నది. తనకు విధించిన మరణ శిక్షపై దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. తీర్పుపై సమీక్ష కోరే హక్కు దోషికి ఉండదని న్యాయమూర్తులు అన్నారు. ఈ దోషులకు ఉరిశిక్ష సరైనదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

తన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని నిర్భయ కేసులో దోషి అయిన అక్షయ్‌సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతని అభ్యర్థనపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరినా.. పట్టించుకోలేదని, దర్యాప్తు అధికారుల అసమర్థత వల్ల ఈ కేసులో నిజమైన దోషులను పట్టుకోలేకపోయారని అక్షయ్‌కుమార్‌సింగ్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

ఈ రివ్యూ పిటిషన్‌ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే సోమవారం తప్పుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఆర్‌ బానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఈ  పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, నిర్భయ తల్లి తరఫున విచారించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్‌ బాబ్డే ప్రకటించారు.

దీంతో బుధవారం మరో బెంచ్‌ విచారణ చేపట్టింది. నేటి మధ్యాహ్నం రెండుగంటలకు పటియాల హౌజ్‌ కోర్టులో నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్ల జారీపై విచారణ జరగనుంది.

Related posts

ఏపీ లో 20న రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

Satyam NEWS

న్యూ డైరెక్షన్: ఉద్యోగం అడగవద్దు ఇచ్చే స్థాయికి రండి

Satyam NEWS

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment