ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్టులతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జిమ్మిక్కులకు తాము ఆయన వలలో పడబోమని, పాత ఆలోచనలు ఇప్పుడు చెల్లవు ఆయన అన్నారు. టిడిపి నేతలు పై పెట్టిన కేసులు ప్రజలు నుండి వచ్చినవే తప్ప తాము పెట్టినవి కాదని మంత్రి అన్నారు. బలహీన వర్గాలు, ఎస్ సి లు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చిన్న చూపు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నదని మంత్రి అన్నారు. కోడెల, యరపతినేని పల్నాడు లో అనేక అరాచకాలు చేశారని బొత్స తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పాలన అందిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రజాస్వామ్య బద్దం గా చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని జగన్ 2019 లో నిర్వహించిన కలెక్టర్లు సమావేశాలలో చెప్పగా, మా పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించాలని చంద్రబాబు 2014 లో జరిగిన చంద్రబాబు తొలి జిల్లా కలెక్టర్ల సమావేశంలో చెప్పారని బొత్స సత్యనారాయణ అన్నారు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే చంద్రబాబు చేసింది ఏమిటి గ్రాఫిక్స్ చూపి ఎన్నికల ముందు 36 వేల కోట్ల కు టెండర్లు పిలిచారు ఇదా పాలన అంటే అని ఆయన ప్రశ్నించారు.
previous post