40.2 C
Hyderabad
April 28, 2024 18: 53 PM
Slider ముఖ్యంశాలు

“క్రాక్” సినిమాలో మాదిరిగా మిస్సింగ్ కేసును ప‌ట్టుకున్న డీఎస్పీ….!

#vijayanagaramdsp

హీరో ర‌వితేజ న‌టించిన క్రేక్ సినిమా అంద‌రూ చూసే ఉంటారు. త‌ర‌చూ టీవీల‌లో రెండు ఆదివారాల కొక‌సారి వ‌స్తోంది కూడ‌.ఆ  సినిమాలో ఎప్పుడో న‌మోదైన కేసును..స్టేష‌న్  గుమ్మంకు వేలాడిన ఎఫ్ఐఆర్  ద్వారా  దాన్ని మూలాలు కనుక్కుని అందుకు కార‌కుల‌ను శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానానికి పంపిస్తాడు.అచ్చం క్రాక్ సినిమాలో  హీరో ర‌వితేజ్ లాగానే  విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్…ఇటీవ‌ల వ‌న్ టౌన్,టూటౌన్  పోలీస్ స్టేష‌న్ల‌ను ప‌రిశీలించి  టూటౌన్ ప‌రిధిలో 2016లో న‌మోదైన‌ మిస్సింగ్ కేసు మిస్ట‌రీ చేధించారు.

అది మిస్కింగ్ కాద‌ని….బ‌తుకు నేర్సాల్సిన‌ బావ‌మ‌రిదే….డ‌బ్బు కోసం బావ‌ను అంతం చేసారు. తాజాగా ఆ కేసును టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు…త‌న సిబ్బందితో విచార‌ణ చేసి..న‌లుగురు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు విజయ‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్  పరిధిలో క్రైమ్ నెంబ‌ర్  .175/2016 U/h Man Missing కేసును 2016 న‌వంబ‌ర్ 16 న కేసు న‌మోదైంది. తన యొక్క ఇంటి నుండి హోండా యాక్టీవ్ బండి తో కేతవరం సత్యనారాయణ ఇంటి నుండి వెళ్లిపోయినట్లు అత‌ని కుమారుడైన యుగందర్ ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు నమోదు చేసారు.

సీన్ క‌ట్ చేస్తే….

ఈ నెల 1  వ  తేదీన  స్టేష‌న్ ఎస్ఐ సాగర్ బాబు త‌న‌ సిబ్బందితో కొత్తపేట వాటర్ ట్యాంక్ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండ‌గా హోండా యాక్టీవ్ బండి పై ఫేక్ నెంబర్ పెట్టి విజ‌య‌న‌గ‌రం కు చెందిన మెకానిక్  గండిబోయిన రామకృష్ణ,  విజయనగరంకు రావడంతో అతని బండి తొలి రికార్డ్స్  ను ప‌రిశీలిచంగా  బండిపై ఫేక్ నెంబర్ పెట్టు తిప్పుతున్నట్టు పోలీసులకుఅనుమానం వచ్చి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

దీంతో  విజయనగరానికి చెందిన కొణిసి రాజశేఖర్  బండిని పదివేలకు కొనుగోలు చేయ‌డం… బండి రికార్డులు కూడా తీసుకో లేనట్లు చెప్పగా వెంట‌నే ఎస్ఐ సాగ‌ర్ బాబు…అనుమానంతో  విచార‌ణ ప్రారంభించారు. కాగా సదరు బండిని ఇంజన్ నెంబర్ ఛాయిస్ నెంబరు వెరిఫై చేసి అసలు నెంబర్ ద్వారా ఏపీ35ఏఏ2314నెంబ‌ర్ తో   ఫిర్యాది యుగంధర్ 2016 లో పోలీస్ స్టేషన్లో తన తండ్రి బండితో పాటు తప్పిపోయినట్లు రిపోర్ట్ ఇచ్చినాడు.దీంతో. ఎస్ఐ పరిశీలించి ఆ కేసులో పోలీసులు కొణిసి రాజశేఖర్ తన ఇంటివద్ద అరెస్ట్ చేసి విచారించగా తన నేరం ఒప్పుకున్నాడు. 

తను తన స్నేహుతులు అయిన ఇరుగంటి వెంటక అఖిల్ కుమార్ @ పండు, వయస్సు 25, బ్రాహ్మణ, గడ్డ వీధి విజయనగరం మరియు మత్బోయిన అఖిల్, తండ్రి: రాము అనువర్లకు అదేవీధిలో ఉన్న మామిడి పాక పేర్లు, తండ్రి: నర్సింగరావు అను అతను మాకు పండు ద్వారా కలసి తను కేతవరపు సత్యనారాయణ వద్ద 70 వేల రూపాయలు అప్పు గా తీసుకున్నారు.

అప్పు గా తీసుకున్నట్లు సదరన్ మామిడి పాక పేర్లకు అదే వీధిలో ఉన్న భాగ్యలక్ష్మి తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తన బావ అయినా కేతవరం సత్యనారాయణకు ఆవిషయం తెలిసి తను భాగ్యలక్ష్మి తన దగ్గరకు కామ కోరికలు తీర్చే పంపించమని చెప్పగా దానికి అలాగే అని పేరు చెప్పినట్లు కానీ తన దగ్గరకు తీసుకుని వెళ్లకపోవడంతో అర్జెంటుగా డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తున్నట్లు లేకపోతే చంపుతానని బెదిరించాడు.

అతను పెట్టిన భరించలేక ఎలాగైనా తన భావన చంపించాలని ఉద్దేశంతో మాకు చెప్పగా  రాజశేఖర్ మరియు అఖిల ముంగినాపల్లి స్మసనవతిక వద్ద ఉండగా రాత్రి 10.00 గంటల సమయంలో పేర్లు, సత్యనారాయణను తీసుకొని అత‌ని ఇనుప రాడ్డు తో తల పై కొట్టి చంపివేసినట్లు తన వంటి పై ఉన్న 4 ఉంగరాలు,బ్రాస్లెట్ తీసుకొని పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు అంగీక‌రించారు. ఈ మేర‌కు టూటౌన్  సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు.కానిస్టేబుళ్లు  పైడిత‌ల్లి నిందితుల‌ను  అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.

Related posts

ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే కాలేరు యోగా

Satyam NEWS

బలవంతపు సర్వేను నిలుపుదల చేయాలి

Bhavani

క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యo వహిస్తే ప్రతిఘటన

Satyam NEWS

Leave a Comment