25.2 C
Hyderabad
May 8, 2024 07: 17 AM
Slider ఆదిలాబాద్

తండ్రిలేని ఓ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సాయం

#mlakonerukonappa

కొమరం బీమ్ జిల్లా పెంచికల్ పేట్ మండలం అగర్ గూడా గ్రామం కి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తుమ్మిడే శ్రీనివాస్ గత సంవత్సరo మరణించారు. టీఆర్ఎస్ పార్టీ కి అతను చేసిన సేవలను సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుర్తించి కోల్పోయిన కార్యకర్తకి అండగా నిలవాలని అనుకున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె తుమ్మిడే సుజాత వివాహం నిశ్చయమైంది. దీని కోసం  ఒక లక్ష యాభై వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయడానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నగదు అందించారు. వివాహం కుదుర్చుకున్న తరువాత వివాహ పూర్తి బాధ్యత తానే చూసుకుంటాను అని కూడా ఆయన భరోసా కల్పించారు.

కోనేరు కోనప్ప తన మనస్సు ఎంత గొప్పదో ప్రతి నిత్యం ఎదో ఒక వార్త రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటారు. కార్యకర్త కుటుంబానికి భరోసా పెంచే నాయకులలో కోనప్ప ముందుగా ఉంటారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు కోనప్ప పూజారి వెంకటి చేతుల బిదుగా ఆడబిడ్డకు 1,50,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ సరిత రాజన్న పుల్లూరి రామన్న రంగయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు

Related posts

కొల్లాపూర్ సర్కిల్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

ఎల్లారెడ్డి స్మశాన వాటికను రక్షిద్దాం, వైకుంఠధామంగా తీర్చిదిద్దుదాం

Satyam NEWS

గిరిజనుల మనోభావాలపై కేంద్రం దెబ్బ

Sub Editor 2

Leave a Comment