29.7 C
Hyderabad
April 29, 2024 08: 14 AM
Slider మహబూబ్ నగర్

యువత మత్తు జోలికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుందాం

#nagarkurnool

యువత గంజాయి వైపు దారి మళ్లకుండా మంచి భవిష్యత్తును అందించడం మన అందరి బాధ్యత అని నాగర్ కర్నూల్  జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లహరి గార్డెన్ లో రెవిన్యూ, పోలీసు, ఎక్సైజ్, విద్యా వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో గంజాయి రవాణా, నార్కోటిక్ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో బాటు జిల్లా ఎస్పీ కె మనోహర్, అదనపు కలెక్టర్ మను చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు సామాజిక చెడు అని, వీటితో సమాజం దెబ్బతింటుందని, శాంతిని కోల్పోతుందని అన్నారు.

ఈ సామాజిక చెడును ప్రారంభ దశలో నియంత్రించాలని ఆయన తెలిపారు. యుక్త వయస్సు పిల్లలు వీటికి ఎక్కువ ప్రభావితం అవుతారని ఆయన అన్నారు. సమాజంలో సర్పంచ్, ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని, సామాజిక చెడు నిర్మూలనలో వీరు క్రియాశీలకంగా ఉండాలని అన్నారు.

సామాజిక చెడు పై అవగాహన గురించి ప్రతిచోటా చర్చ జరగాలని, ఈ చెడు ఎందుకొస్తుంది, దీనిని ఎలా అరికట్టాలనే దానిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ కమిటీలు దీనిని బాధ్యతగా తీసుకోవాలని, ఒక నెట్ వర్క్ లా, సమిష్టిగా పనిచేయాలని అన్నారు.

ఎవరికైనా కౌన్సిలింగ్ అవసరమైన పక్షంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సెలింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని  కలెక్టర్ తెలిపారు. మాదకద్రవ్యాలు సేవించిన, సాగు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతు బంధు, రైతు బీమా లను నిలిపివేయడంతో  పాటు ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు అమలు కావని  ఆయన అన్నారు. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

 జిల్లా ఎస్పీ కె మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సేవించే వారిని గుర్తించి, పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇప్పటికి 11 మంది పైన కేసులు నమోదు చేసినట్లు, వారి నుండి గంజాయిని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులపై పిడి యాక్ట్ కు చర్యలు చేపడతామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదకద్రవ్యాల నిర్మూలనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో ఏం జరుగుతుంది, క్రొత్తవారు, దూరప్రాంతాల నుండి ఎవరొచ్చారు అనే సమాచారం ప్రజాప్రతినిధులకు తెలుస్తుందని, వారు అనుమానితుల సమాచారం అందించాలని అన్నారు. విద్యా సంస్ధల్లో ర్యాగింగ్ పై ఎలా ఫిర్యాదు చేస్తున్నారో, అదే విధంగా మాదకద్రవ్యాలపై సమాచారం ఇవ్వాలని అన్నారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గుడుంబా రహిత గ్రామాలకు కృషి చేసినట్లే, మత్తు రహిత గ్రామాలకు కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలన్నారు.

కొల్లాపూర్ ప్రాంతంలో గంజాయి సాగు చేసిన రైతులకు రైతుబంధు నిలిపివేసే లా జిల్లా కలెక్టర్ కు సిఫారస్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన  కార్యక్రమాలను అందించి, విద్యార్థులచే వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ కాంపిటీషన్ లను నిర్వహించాలని డిఈవోను ఆదేశించారు.

అదేవిధంగా సమాచార సేకరణకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

 జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ దత్త రాజు గౌడ్ మాట్లాడుతూ సరదాగా మొదలైన అలవాటు బానిసగా మార్చుతుందని, శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేసి యువతను నాశనం చేస్తుందని అన్నారు. ఈ మహమ్మారిని ఆదిలోనే అంతం చేయాలని, ఆరోగ్య సమాజ నిర్మాణం చేయాలని అన్నారు. సమిష్టి కృషితో గ్రామ, పట్టణ స్థాయిలో పనిచేయాలని ఆయన అన్నారు.

గంజాయి, మాదకద్రవ్యాలపై 18004252523, అధికారుల నెంబర్లు 9440902282, 9440902615, 9440902616, 9440902617,9440902618,9440902619 లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ జడ్పిటిసి శ్రీశైలం మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలపై ప్రభావం చూపుతాయని, పిల్లల ముందు మద్యపానం మత్తు పదార్థాలు సేవించే రాదని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని వారు సైతం మద్యానికి దూరంగా ఉండాలని హితవు పలికారు.

పెద్దకొత్తపల్లి జడ్పిటిసి గౌరమ్మ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులు ద్వారా పిల్లలపై తీవ్ర చెడు ప్రభావం పడుతుందన్నారు తప్పనిసరిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఖురేషీ , డిఈఓ గోవిందరాజులు, డిపివో కృష్ణ, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ నాగలక్ష్మి, డీఎస్పీ మోహన్ రెడ్డి, నాగర్కర్నూల్ జడ్పిటిసి శ్రీశైలం, పెద్దకొత్తపల్లి జడ్పిటిసి గౌరమ్మ, తెలకపల్లి ఎంపీపీ కొమ్ము మధు, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, నాగర్ కర్నూల్ డివిజన్ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కళాశాల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ సిఐ లు గాంధీ, వెంకట్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ లు ఏడుకొండలు, పరమేశ్వర్ గౌడ్, జనార్ధన్, అనంతయ్య, ఎక్సైజ్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్య న్యూస్.నెట్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్

Related posts

ఉప్పల్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం

Satyam NEWS

పట్టాభి పై కృష్ణా జిల్లా ఎస్ పి తీవ్ర వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment