33.7 C
Hyderabad
April 29, 2024 01: 18 AM
Slider ప్రత్యేకం

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే

#bandi

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగా   రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, రాబోయేది బీజేపీ సర్కారేనని చెప్పారు. సీఎం కొడుకును బర్తరఫ్ తోపాటు పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తామని చెప్పారు.

నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్ లో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఆరంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని బండి సంజయ్ ఆవిష్కరించి సమావేశాలను ప్రారంభించారు. బండి సంజయ్ తోపాటు ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య, కోలార్ ఎంపీ మునుస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రులు విజయరామారావు, సుద్దాల దేవయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, వేముల అశోక్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఘనత మోడీదేనని… పంచ్ తీర్ధాలను ఏర్పాటు చేసింది.. నేను ప్రధాని అయ్యానంటే అంబేద్కర్ పెట్టిన భిక్షేనని చెప్పిన నాయకుడు మోడీయేనని… అంత్యోదయ పథకాన్ని తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న మహానేత పీఎం మోడీ అని స్పష్టం చేశారు… బండి సంజయ్.  

మరి తెలంగాణలో ఏం జరుగుతోంది? కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగునా అవమానిస్తున్నారని.. దళితులకు సీఎం పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని.. దళితులకు మూడెకరాలిస్తానని మోసం చేశారని… అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై తాత్సారం చేస్తే బీజేపీ వార్నింగ్ ఇస్తే తప్ప పనులు ముందుకు సాగనీయని దుర్మార్గపు సర్కార్ కేసీఆర్ దేనని సంజయ్ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే… అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని… ఆర్దిక వృ ద్దిలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదే. 2047 నాటికి భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరబోతోందని జోస్యం చెప్పారు.దేశం ఆర్దికంగా ముందుకు పోతుంటే… తెలంగాణ మాత్రం అప్పుల పాలై చిప్ప చేతికి ఇస్తున్న ఘనత కేసీఆర్ దే అని ఆరోపించారు.

దళితుల, ప్రజల బాధలను పట్టించుకోని కేసీఆర్ దొంగ సారా దందా చేసిన తన బిడ్డ ను కాపాడుకునేందుకు ఢిల్లీకి మంత్రులను పంపడం సిగ్గు చేటు. దొంగ సారా, అవినీతి దందాలపై బీజేపీ పోరాటాన్ని కొనసాగించి తీరుతుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకుతో బాధపడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే…. ఆయన కొడుకు ముఖ్యమైన మంత్రి. అన్నింటికీ ఆయన కొడుకే మాట్లాడతాడు. కానీ ఆయన శాఖలో జరిగే వైఫల్యాలపై నోరు మెదపడు. కుక్క కరిచి పిల్లలు చనిపోతున్నా, నాలాలో పడి చనిపోతున్నా, అగ్ని ప్రమాదాలు సజీవ దహనమైపోతున్నా పట్టించుకోడు. టీఎస్సీఎస్సీ పేపర్ లీకులోనూ ఆయనే బాధ్యుడు. అందుకే కేసీఆర్ కొడును బర్తరఫ్ చేసేదాకా పోరాడతాం… ఈరోజు నిరుద్యోగులంతా బీజేపీ చేసే పోరాటాలకు మద్దతిస్తున్నారని అన్నారు.    

నిరుద్యోగులందరికీ బీజేపీ అండగా ఉంటుంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మాతో కలిసి రండి. సీఎం కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాడదాం… పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రలక్ష చొప్పున పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తాం… సిట్టింగ్ జడ్జిపై విచారణ జరిగే వరకు పోరాడతాం… అందులో భాగంగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో ఉదయం 10 గంటలకు 1 గంట వరకు దీక్ష చేయబోతున్నామని తెలిపారు.

టీఎస్సీపీఎస్సీ లీకేజీలో కేసీఆర్ కొడుకు పాత్ర ఉందని.. సీఎంఓ కుట్ర కూడా ఉందని.. సీఎంవో పనిచేసే పదవీ విరమణ పొందిన అధికారే ఈ కుట్రలో భాగస్వామి అని… పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర ఉందని.. అయినా కిందిస్థాయి వాళ్లపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని… చర్చను దారి మళ్లించేందుకు బీజేపిని బదనాం చేయాలనుకుంటున్నారని… వీటిపై ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలు వివరించాలని. . దళిత మోర్చా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నారు…బండి సంజయ్.

అందరం కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా ఉంటూ ఐక్యపోరాటాలు చేద్దాం.. దళిత మోర్చా నాయకులకు లాల్ సింగ్ ఆర్య స్పూర్తి.. కిందిస్థాయి నుండి పైకొచ్చిన నాయకుడని…. ఆయనతోపాటు అంబేద్కర్ స్పూర్తితో దళిత నేతలంతా విస్త్రత పోరాట కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.

Related posts

విశాఖ రైల్వే డి.ఆర్.ఎం.తో విజయనగరం ఎం.పి. బెల్లాన భేటీ

Satyam NEWS

రూపు మార్చుకుంటున్న కరోనా కావాలని సృష్టించినదే

Satyam NEWS

తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటాం

Satyam NEWS

Leave a Comment