33.7 C
Hyderabad
April 30, 2024 01: 41 AM
Slider నల్గొండ

శిథిలావస్థకు చేరుకుంటున్న మోడల్ కాలనీ ఇండ్లు

#Modal Colony

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట వద్ద నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఆదర్శ కాలనీ ఇండ్ల పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డ్ గామార్చిన వారిపై చర్యలు చేపట్టాలని, అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ జయశ్రీకి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆదర్శ కాలనీ ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షుడు యల్క సోమయ్య గౌడ్, కార్యదర్శి మందాడి విశాల మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా హుజూర్ నగర్ పట్టణంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తూ, సొంత గూడులేని నిరుపేదలు ఇంటి కియిలు చెల్లించలేక ఎన్నో అవస్థలకు గురవుతుంటే, ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులుగాని వారిని పట్టించుకోవడంలేదని అన్నారు.

మోడల్ కాలనీలో 2160 జి ప్లస్ వన్ ఇండ్లు సుమారు 70 శాతం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పని పూర్తి చేసినప్పటికీ, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ మిగిలిన 30 శాతం పని పూర్తి చేయకపోవటం శోచనీయమని అన్నారు.

అధికారులు వెంటనే స్పందించి అక్కడ డంపింగ్ యార్డ్ ను తొలగించి, నిర్మించిన ఇండ్లను డబల్ బెడ్ రూమ్ గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని  కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తాఫా, భీమపంగు విజయ, నందిపాటి సైదులు, గడ్డం ఉమా, సుగుణ, మంగమ్మ, కళ్యాణి, భూలక్ష్మి, సరస్వతి, సతీష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Related posts

యస్ఐ దంపతుల  ఆత్మహత్య

Murali Krishna

నాలుగు నెల‌లో రామతీర్ధం ఆల‌య నిర్మాణం పూర్తి చేసాం

Satyam NEWS

కొండగట్టులో కేసీఆర్ కుటుంబం భూముల దందా…!

Satyam NEWS

Leave a Comment