26.7 C
Hyderabad
May 3, 2024 08: 30 AM
Slider ప్రత్యేకం

దీపావళికి బద్రీనాథ్ వెళుతున్న ప్రధాని మోదీ

#primeministernarendramodi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా బద్రీనాథ్ ధామ్‌ లో పర్యటించబోతున్నారు. అక్కడ ఆయన బద్రీ విశాల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే తన కలల ప్రాజెక్ట్ బద్రీనాథ్ మాస్టర్ ప్లాన్‌ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది.

దీంతో పాటు బద్రీనాథ్ ధామ్‌లోని బైపాస్ రోడ్డు, బద్రీష్ సరస్సు, శేషనేత్ర సరస్సులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రధాని అయిన తర్వాత మోదీ బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించడం ఇది రెండోసారి. ప్రధానమంత్రి సందర్శనకు అవకాశం ఉన్న దృష్ట్యా, పీఎంవో బృందంతో పాటు చమోలి జిల్లా యంత్రాంగం కూడా బద్రీనాథ్ ధామ్‌ను మాస్టర్ ప్లాన్ పనులకు సంబంధించి నిరంతరం పరిశీలిస్తోంది.

పర్యాటక శాఖ ప్రత్యేక కార్యనిర్వహణాధికారి భాస్కర్ ఖుల్బే, ప్రధానమంత్రి కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ మంగేష్ గిల్డియాల్ బద్రీనాథ్ చేరుకుని ప్రధానమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ బద్రీనాథ్ మాస్టర్ ప్లాన్ కింద జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. BRO బైపాస్ రోడ్, వన్ వే లూప్ రోడ్, శేష్ నేత్ర, బద్రీష్ లేక్, అరైవల్ ప్లాజా, ఇంటర్నేషనల్ బస్టాండ్, హాస్పిటల్ విస్తరణ పనులను పరిశీలించారు.

పునర్నిర్మాణ పనులు బాగా సాగడం పట్ల భాస్కర్ ఖుల్బే సంతోషం వ్యక్తం చేశారు. ప్రతికూల, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ సవాలుతో కూడిన పనిని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని, బద్రీనాథ్‌లో పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, తప్పకుండా వచ్చే ఏడాది నాటికి అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు. ఈ పనులు పూర్తి అయితే యాత్రీకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

Related posts

లాక్ డౌన్ ఉల్లంఘనలపై డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా

Satyam NEWS

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పై రేప్ కేసు

Bhavani

మూడు ముక్కలాటలో వైసీపీకి జాక్ పాట్

Satyam NEWS

Leave a Comment