30.7 C
Hyderabad
April 29, 2024 04: 30 AM
Slider రంగారెడ్డి

సీబీఐ, ఈడీ దాడులు చూసి క్వారంటైన్ పోతున్న కేసీఆర్ కుటుంబం

#bandisanjai

బీజేపీ రాష్ట్ర అధ్య క్షులు, ఎంపీ బండి సంజయ్ కుమా ర్  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం మేడ్చల్ జిల్లా, ఎల్పీ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ నాగోల్ చౌరస్తాకు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సత్కరించారు. గొర్రెపిల్లను బహుకరించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల సంఖ్య లెక్క చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ప్రజా సంగ్రామ యాత్ర నిన్నటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను తెలుసుకు నేందుకు, సంవత్సరం కాలంగా పాదయాత్ర చేస్తున్న కెసిఆర్ మాత్రం ప్రజల సమస్యలను  గాలికి వదిలేసి, కబ్జాల మీద దృష్టి పెట్టారని ఆరోపించారు. తెలంగా ణ రాష్ట్రా నికి ప్రధాని నరేంద్ర మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశారు. కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను కూడా  కేసీఆర్ కట్టించడం లేదు. కెసిఆర్ సంగతేందో చూడండి అని ప్రజలను కోరారు. మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఓట్లు వేసి గెలిపించినా… మీకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. కేసీఆర్ ఓట్ల కోసం మాత్రమే… పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ లని ప్రజలను ఆశ పెడుతున్నాడని ఆరోపించారు.

కెసిఆర్  ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాడో…లెక్క చెప్పమని అడిగితే… ఇప్పటివరకు స్పందించ లేదన్నారు. రెండు సంవత్సరాలుగా ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాడో… లబ్ధిదారుల జాబితా ఇమ్మని లేఖలు రాస్తున్నా… కేసీఆర్ నుంచి సమాధానం రాలేదన్నారు.  పేదోళ్లకు ఇండ్లు రాకుండా చేస్తున్న మూర్ఖుడు, దుర్మార్గుడు కేసీఆర్ అని ఆరోపించారు.  తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులకు ఇల్లు కట్టిస్తా మనీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో… కెసిఆర్ సంగతేందో చూసే బాధ్యత బిజెపి ది అన్నారు.        

పాతబస్తీలో ముస్లింలకు హౌస్ టాక్స్ 100 రూపాయలు కూడా వసూలు చేయ లేని సమర్థ ప్రభుత్వం అన్నారు.  హిందువులకు సంబంధించిన కరెంటు బిల్లు, నల్లా బిల్లు, హౌస్ టాక్స్ సహా… అన్ని బిల్లులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తారని.. పాతబస్తీలో నల్లా బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి బిల్లు మాత్రం వసూలు చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. మనం కట్టే పైసలను ముఖ్యమంత్రి దోచుకుని, ఇక్కడ కనీస సౌకర్యా లేవన్నారు. ఇటీవల వరదలకు సిటీ పరిధిలో చాలా ప్రాంతాలు మునిగిపో యా నీ నీ జీహెచ్ఎంసీలో వరదల సమయంలో ఒక్కొక్క ఇంటికి పదివేల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి… కేవలం టిఆర్ఎస్ వాళ్లకి మాత్రమే ఇచ్చుకున్నాడని ఆరోపించారు. .

ముఖ్యమంత్రి కేసీఆర్ పాస్పోర్టుల బ్రోకర్ అని ఆరోపించారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని.. అందుకే ఒక్క చినుకు పడితే ఇక్కడ అంతా సముద్రమయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు.  నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఇంకా ఉందని నేను సీఎం అయిన సంవత్సరం తర్వాత ఈ డ్రైనేజీ సంగతి ఏంటో చూస్తా అని కేసిఆర్ హామీ ఇచ్చాడు. మరి ఆ హామీ ఏమైంది? పేదలకు ఇండ్లు ఉంటే పట్టాలు ఇవ్వడం లేదు. ఇక్కడ ఇండ్లకు రిజిస్ట్రేషన్లు కూడా లేవు. అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే… అమ్ముకోడానికి, కొనడానికి కనీసం రిజిస్ట్రేషన్లు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్  ప్రజలకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ప్రజలకు అండగా నిలబడుతున్న బిజెపి కార్పొరేటర్ల పై లాఠీచార్జి చేసి, పిడి యాక్ట్ పెట్టి జైల్లో పెడుతున్నారని అన్నారు.  పేద ప్రజల కోసమే బిజెపి కొట్లాడుతోంది. ఎంతమంది రైతులకు రుణమాఫీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు వచ్చాయో మీరే ఆలోచించండి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రజల నెత్తిపై లక్ష ఇరవై వేల అప్పు పెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబం అన్ని స్కాములు చేసి, వేల కోట్లు దండుకున్నారు.

లిక్కర్, సాండ్, డ్రగ్స్ పత్తాలు… ఇలా అన్ని స్కాములు ముఖ్యమంత్రి అండ్ టీం దే. పేద ప్రజలను కేసీఆర్ కనీసం పట్టించుకోవడం లేదు. ఈడీ అంటే కరోనా… సిబిఐ అంటే కాలు ఇరుగుతది. క్వారంటైన్ పేరుతో మళ్లీ ఏదో కొత్త స్కామ్ కు స్కెచ్ వేస్తున్నారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర సంపదను ఎలా దోచుకుంటుందో… టిఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచన చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై నేను చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో మీరు సైతం భాగస్వామ్యం కండి. తెలంగాణ తల్లి రోధిస్తోంది… ఆవేదన చెందుతోంది. కేసీఆర్ గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి రాలిన చేద్దాం. అమర వీరుల ఆత్మలు గోషించేలా… తెలంగాణ ప్రజలను కేసీఆర్ బాధపెడుతున్నాడు.

కెసిఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ… బిజెపిని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక నిషేధిత సంస్థ అయినటువంటి ‘పిఎఫ్ఐ’ రాష్ట్రంలో ఎలా విస్తరిస్తుందో మీరు చూడండి. టిఆర్ఎస్ నాయకులు కొంతమంది ‘పిఎఫ్ఐ’ సంస్థకు నిధులు ఇస్తూ… ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. బీహార్లో బాంబులు తయారుచేసి, సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ పేల్చాలని ప్లాన్ చేశారు. ఇక్కడ పేలాలనుకున్న బాంబు అక్కడ పేలింది. వీటన్నిటికీ కారణం ‘పిఎఫ్ఐ’ లాంటి సంస్థలే. ‘పిఎఫ్ఐ’ లాంటి సంస్థలను పెంచి పోషిస్తున్నది ‘టిఆర్ఎస్, ఎంఐఎం’ పార్టీలే. ఈ లుచ్చా గాళ్లను తెలంగాణ పొలిమేరల వరకు ..అని బండి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, చింతల సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

Related posts

పాపం పండింది: ఏసీబీ ఉచ్చుకు చిక్కిన ఎస్ ఆర్ ఓ మూర్తి

Bhavani

డాక్టర్ మార్తినేని ప్రియాంక కు గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డ్

Satyam NEWS

సంస్కరణల‌ స్రష్ట

Satyam NEWS

Leave a Comment