38.2 C
Hyderabad
May 1, 2024 21: 28 PM
Slider మహబూబ్ నగర్

విషజ్వరాల నుంచి రక్షణ కోసం గిరిజనులకు దోమతెరల పంపిణీ

#mosquito nets

విషజ్వరాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్నందున అమ్రాబాద్ కోర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత దోమతెరలను పంపిణీ చేపట్టారు. బుధవారం మహబూబ్ నగర్  జిల్లా మలేరియా అధికారి డా. వరప్రసాద్ ఆధ్వర్యంలో వటవర్లపల్లి గ్రామంలోని మంది చెంచు, లంబాడా గిరిజనులకు సర్పంచ్ చత్రునాయక్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మలేరియా జిల్లా అధికారి డా. వరప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా విష జ్వరాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచిన నీటినే తాగాలని తప్పనిసరిగా దోమతెరలను ఉపయోగించాలని ఆయన సూచించారు.

మిగిలిన చెంచు పెంటలు, కోర్ ఏరియాలో నివసించే ఇతర కులాలకు త్వరలోనే పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వటవర్లపల్లి వైద్యాధికారి సురేష్, సిబ్బంది అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డోంట్ఇంటెర్ఫైర్:ఐరాసలో బెడిసికొట్టిన పాక్ ప్రయత్నం

Satyam NEWS

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి స్పందన

Satyam NEWS

జ‌గ‌న్ ప‌డ‌గొట్టాడు…లోకేష్ నిల‌బెట్టాడు

Satyam NEWS

Leave a Comment