లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట కానిస్టేబుల్ కనకరాజ్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇసుక మామూళ్లు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సీఐ, ఎస్‌ఐ చెబితేనే డబ్బు తీసుకున్నట్లు తెలపడంతో ఏసీబీ అధికారులు సీఐ, ఎస్‌ఐను విచారించారు. అనంతరం సీఐ లింగమూర్తి, ఎస్‌ఐ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
previous post