దక్షిణ అయోధ్య అయిన భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లో ఉత్తర ద్వార దర్శనం సాగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఉదయం ఆరుగంటల వరకు ఉత్తరద్వార దర్శనం సాగింది. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శన మిస్తున్నారు.