29.7 C
Hyderabad
April 29, 2024 10: 16 AM
Slider వరంగల్

ముంపు ప్రదేశాలను తనిఖీలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్

#MuluguCollector

ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య మంగళవారం ముంపు ప్రాంతాల తనిఖీలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తూ, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏటూరునాగారం అకినేపల్లి, ఎస్సి కాలనీ, వెంకటాపూర్ మండలం పాలంపేటల్లో తనిఖీలు చేశారు.

అకినేపల్లి ఇంటెక్ వెల్ ను కూడా ఆయన పరిశీలించారు. రామప్ప చెరువు మత్తడి పోస్తూ పాలంపేట గ్రామంలో వరదతో నష్టం వాటిల్లిందని, ముంపు ప్రాంతం ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని అన్నారు.  నీటిపారుదల శాఖ ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ఇకముందు ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారిణి పి. భాగ్యలక్ష్మి, జిల్లా బిసి సంక్షేమ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్ కిషోర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Related posts

సూర్యారావు కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత

Satyam NEWS

ఇంకా రోడ్డు సౌకర్యం లేదు…. సిగ్గు సిగ్గు

Satyam NEWS

ఎర్రచీర మేకింగ్ వీడియో విడుదల

Satyam NEWS

Leave a Comment