29.7 C
Hyderabad
May 2, 2024 06: 08 AM
Slider వరంగల్

పస్రా ఎటాక్:అప్పు చెల్లించమన్నందుకే దయ లేకుండా

mulugu two murders asking for repay loan

తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగినందుకు అత్యంత దారుణంగా ఇద్దరినీ హత్య చేయదానికి యత్నించగా ఒకరు మృతి చెందడం తో పాటు మరొకరు మృతువుతో పోరాడుతున్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది.ఇందులో ఒకరు జర్నలిస్ట్ కావడం తో తెలంగాణా జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారు.ఒకరిని గొంతు నులిమి చంపగా మరొకరిని దారుణంగా నరికినా ఈ సంఘటన తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితికి అడ్డం పడుతున్నాయి.

ములుగు జిల్లా గోవిందరావు పెట్ మండలం పస్రాలోని బెంగుళూరు బేకరీ యజమాని దయ అలియాస్ దయానంద్ అలియాస్అ దేవరాజు అతని సోదరుడు కలిసి బేకరీ పెట్టేందుకు ఆత్మకూర్ మండలం ఒగ్లాపూర్ కు చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఎనిమిది లక్షల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో పాటు వాయిదాలు వేస్తుండటం తో మిత్రుడైన జర్నలిస్ట్ సునీల్ రెడ్డి కి విషయం చెప్పి సహాయము చేయాలనీ కోరాడు. దీనితో పస్రాలోని పోలీసులు జర్నలిస్టులతో సత్సంబందాలు ఉన్న జర్నలిస్ట్ సునీల్ రెడ్డి తో కలిసి దేవేందర్ రెడ్డి అప్పు వసూలు కోసం పస్రా కి వెళ్లారు.దయ అనే పేరు గల బేకరీ నడిపే వ్యక్తి దగ్గరికి సునీల్ రెడ్డి తన స్నేహితుడు దేవేందర్ రెడ్డి తో వెళ్లి డబ్బులు చెల్లించాలని కోరాడు.

దీనికి దయ నాకు వెంకన్న అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి అతని వద్దకు వెళ్ళుదామని కోరగా అందరు కలిసి వెంకన్నదగ్గరికి వెళ్లారు.అక్కడ వెంకన్న దయకు నేను చాలా డబ్బులు ఇచ్చాను పైగా తన కూతురు పెళ్లి ఉన్నందున ఇంకా ఏమైనా ఉంటె లెక్క చూసుకొని ఫైనల్ చేసుకుందామని ప్రస్తుతం తన దగ్గర డబ్బుల్లేవని వారిని తిప్పి పంపి వేసాడు.దీనితో సునీల్ రెడ్డి కృష్ణ రెడ్డి లు ఈ రోజు తాము డబ్బులు తీసుకోకుండా తిరిగి వెళ్ళమని హెచ్చరిస్తూ అక్కడే ఉండటంతో తో పాటు వాగ్వాదానికి దిగారు.

దీనితో పరువు పోతుందని భావించిన దయ సునీల్ రెడ్డిని దేవేందర్ రెడ్డి ని తిరిగి బేకరీ కి తీసుకెల్లి సునీల్ రెడ్డి నీ బేకరీ ముందు కూర్చుండబెట్టి మాటల్లో ఉంచి దేవేందర్ రెడ్డి ని బతిమిలాడుతున్నట్లుగా బేకరీ వెనకవైపు తీసుకువెళ్లి అక్కడే ఉన్న తన తమ్ముని తో కలిసి గొడ్డలి లేదా కత్తులతో దారుణంగా తలపై మెడపై గాయపరిచారు .వెంటనే దయ భార్య బేకరీ మూసివేయాగా రక్తపు మడుగులో కొట్టుకుంటున్న దేవేందర్ రెడ్డి న్ని అక్కడే వదిలి వచ్చి ఆయనను తన తమ్ముడు డబ్బులు ఇచ్చేనందుకు తీసుకు వెళ్లాడని .చెబుతూ తన గదిలో కొంత డబ్బు ఉందని తీసుకు వద్దాం పద అంటూ సునీల్ రెడ్డిని దయ ఉండే కిరాయి గదికి తీసుకెళ్లి గొంతు నులిమి దారుణం గా హత్య చేసాడు.కాగా సునీల్ పై కూడా కత్తి తో దాడి జరిగినట్లు మరో కథనం వినిపిస్తుంది.

బేకరీ యజమాని దయ అతని సోదరుడు పథకం ప్రకారం సునీల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ల పై దాడులు చేయగా సునీల్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా దేవేందర్ రెడ్డి ని చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ఎంజిఎం లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉండటం తో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.దాడులతో పస్రా పట్టణంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.పోలీస్ లు రంగం లోకి దిగి వివారాలు సేకరిస్తున్నారు.

మృతి చెందిన సునీల్ ఆవివాహితుడని ,అందరితో కలుపుగోలుగా ఉంటాడని అతని స్నేహితులు జర్నిలిస్టులు తెలుపుతుండగా దేవేందర్ రెడ్డి గూర్చి ఇంకా వివారాలు తెలియరాలేదు.మొత్తానికి సాయం చేయడానికి వెళ్లి అకారణం గా మరణించడము తో జర్నలిస్టులు ఈ సంఘటనను ఖండిస్తున్నారు. అసలు ఎవరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది,వీరు ఎందుకు ఎం ఆశించి ఈ డబ్బులు అడిగారు,డబ్బులు అడగడం తోనే దయ అతని సోదరుడు

హత్య చేశాడా లేకా వీరు అతన్ని బెదిరించారా ,ఇదే మొదటి సారి డబ్బుల కోసం పస్రాకు వెళ్ళారా లేక ఇంతకు ముందు వెళ్లి వారిపై ఒత్తిడి తెచ్చినందుకే హంతకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే సందేహాలు వెలువడుతుండాగా ఈ అంశాలు పోలీసులు పరిశోదించాల్సి ఉంది.

Related posts

గతేడాదితో పోలిస్తే తగ్గిన నేరాల సంఖ్య

Bhavani

కడప తెలుగుదేశం అధ్యక్షుడికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

మేనల్లుడితో అక్రమ సంబంధం కారణంగా అత్త హత్య

Satyam NEWS

Leave a Comment