29.7 C
Hyderabad
May 2, 2024 05: 28 AM
Slider ప్రత్యేకం

వ్యతిరేక ఫలితాలు వచ్చే మునిసిపాలిటీలన్నీ వాయిదా

amaravathi 26

కచ్చితంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాజధాని ప్రాంతంలోని మునిసిపాలిటీలకు ఎన్నికలను వాయిదా వేశారు. రాష్ట్రంలో మొత్తంలో 29 మునిసిపాలిటీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ మునిసిపాలిటీలలో కేవలం గుంటూరు జిల్లాలోనే 7 మునిసిపాలిటీలు ఉండటం విశేషం.

వాయిదా పడిన మునిసిపాలిటీలలో అమరావతి రైతుల ఉద్యమ ప్రభావం ఉన్న ప్రాంతాలు కూడా ఉండటం మరింత విశేషం. ఇది వైసిపికి కలిసి వచ్చేలా జరిగిందో ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలాచేశారో తెలియదు కానీ వీటన్నింటిపైనా కోర్టు కేసులు ఉన్నాయి.

మునిసిపాలిటీలలో విలీనం చేయడంపై కొన్ని గ్రామాల వారు కోర్టులకు వెళ్లడం లాంటి కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డ మునిసిపాలిటీల వివరాలు  జిల్లాల వారిగా శ్రీకాకుళం: ఆముదాలవలస, రాజాం, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు, కృష్ణా : గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు: బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల,దాచేపల్లి,

ప్రకాశం: కందుకూరు,దర్శి, నెల్లూరు: గూడూరు,కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు: శ్రీకాళహస్తి, కుప్పం, కడప జిల్లా: రాజంపేట, కమలాపురం, కర్నూలు: బేతంచర్ల. అదే విధంగా కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అవి: శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం.

Related posts

కంటైన్ మెంట్ జోన్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

Satyam NEWS

కౌలాస్ నాలా ప్రాజెక్టు లో పడి ఒకరు గల్లంతు

Satyam NEWS

Leave a Comment