28.7 C
Hyderabad
April 27, 2024 06: 17 AM
Slider నల్గొండ

పేదల ఇళ్ళను తొలగించాలని ఒత్తిడి చేయడం సరికాదు: సిఐటియు

#cituc

గత 30 సంవత్సరాలకు పైగా ఎస్ బి ఐ బ్యాంక్ మధ్య సందులో వ్యాపారాలు చేస్తూ పూరి గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారిని తొలగించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేయడం సరైంది కాదని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. ఈ సందర్భంగా హుజుర్ నగర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ గుడిసె వాసులు గత 30 సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా నాటి సర్పంచ్ చింతలపూడి రాములు సుమారు  ఇరవై కుటుంబాలకు ఉపాధి కల్పించుటకు ఎస్ బి ఐ బ్యాంక్ పక్కన గుడిసెలు ఇచ్చారని,కానీ ఇప్పుడు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేయడం సరైంది కాదని,అట్టి పేద కుటుంబాలకు ఇండ్లని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకి ఖాళీ చేయించాలని కోరారు.

గుడిసె వాసులతో మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో ఇప్పుడిప్పుడే ప్రధాన రోడ్లు బాగు పడుతున్నాయని, గతంలో అనేకసార్లు అర్హులైన వాళ్ళందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట వద్ద ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇల్లు లేని వాళ్ళందరికీ తక్షణమే ప్రభుత్వం పంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పతల వెంకన్న,రామరాజు,శివ,అజ్జు, బాలకృష్ణ,సోమయ్య,వెంకటేశ్వర్లు, తిరుపతమ్మ, గోవిందమ్మ,వీరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

న్యూ రిలీజ్: మార్చి 6న వస్తున్న పలాస 1978

Satyam NEWS

NEW Cbd Oil And Narcolepsy Is Hemp Cbd Oil Illegal In Alabama

Bhavani

ఏపి పాలిటిక్స్: కేంద్ర బిజెపికి తెలిసి వస్తున్న నొప్పి

Satyam NEWS

Leave a Comment