39.2 C
Hyderabad
April 28, 2024 11: 56 AM
Slider రంగారెడ్డి

పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలను విరమించుకోవాలి

#uppalmunicipality

ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో పేదల ఇండ్లను కూల్చితే సహించేది లేదని ఉప్పల్‌ కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ అధికారులను హెచ్చరించారు. 

మంగళవారం ఉప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మేకల శివారెడ్డి,  మాజీ కార్పొరేటర్‌ మందముల పరమేశ్వరరెడ్డి, తవిడిబోయిన గిరిబాబు , సిహెచ్‌.రఘుపతిరెడ్డి, పుప్పాల వెంకటేశ్వర్లు ఉప్పల్‌ డిప్యూటీ కమీషనర్‌ అరుణకుమారిని కలిసి చర్చించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదలు 60 గజాలు, 70 గజాలలో కట్టుకున్న ఇండ్లను కూల్చితే ఊరుకోమని , 70 గజాల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు పదే పదే చెప్తున్నా పట్టించుకోకుండా పేదలు ఇండ్లు కూల్చేస్తున్నారని ఇలాంటి కూల్చివేతలు విరమించుకోవాలని డీసి కి వివరించారు.

ఎవరైనా అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ప్రారంభ దశలోనే ఆపాలని , ఇంటి నిర్మాణం పూర్తిఅయిన తర్వాత కూల్చడం, పేదలకు ఆస్థి నష్టం కలిగించడం సరిఅయినది కాదని వారు  డీసీ అరుణకుమారికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొరెగ జహంగీర్‌, లింగంపల్లి రామకృష్ణ, నల్ల ప్రభాకర్‌,సుంకు శేఖరరెడ్డి, భాస్కర్‌, మహంకాళిరాజు, ప్రశాంత్‌రెడ్డి, బూత్కూర్‌ మధన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ సహకార బ్యాంకుకు సిమెంటు బల్లలు

Satyam NEWS

అడుగులు తడబడుతున్నా… ఆశతోనే అందరూ…

Satyam NEWS

ఎద్దును కోల్పోయిన రైతులకు కెడిసిసి రూ.25వేలు సాయం

Sub Editor

Leave a Comment