38.2 C
Hyderabad
April 28, 2024 21: 08 PM
Slider హైదరాబాద్

ఐకమత్యంగా ఉండి మున్నూరు కాపు ల శక్తిని చాటాలి

#munnurukapu

మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో పదవులు పొందిన వారికి మున్నూరు కాపు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు, హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి  రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర సంఘం కన్వీనర్ పుట్టం పురుషోత్తమరావు, కో కన్వీనర్ చల్లా హరిశంకర్, ఆర్గనైజర్ కొండ దేవయ్య, అఫెక్స్ కమిటీ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో మున్నూరు కాపు కులం నుండి శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎమ్మెల్సీ దండ విట్టల్ మాజీ ఎమ్మెల్సీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, తెలంగాణ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితర అ మున్నూరు కాపు సంఘానికి చెందిన ప్రముఖులను సన్మానించారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ కు నిర్వాహకులు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడుతూ మున్నూరు కాపులు గా పుట్టడం గర్వ కారణమని చెప్పారు. మున్నూరు కాపులు ఎవరిని కించ పరచరని… అన్ని కులాలతో సన్నిహితంగా ఉంటూ పోటీ తత్వంతో పని చేస్తారని అన్నారు. ఒకప్పుడు మున్నూరుకాపు అని చెప్తుంటే రాజకీయంగా ఇబ్బందికరంగా ఉండేదని నేడు పేరు పక్కన పటేల్ అని గర్వంగా చెప్పుకుని రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో మున్నూరు కాపులు ఉన్నారు అని కొనియాడారు. కరోనా పరిస్థితులవల్ల మున్నూరు కాపు బిడ్డల్ని సన్మానించడం కొంచెం ఆలస్యమైనా కులానికి గుర్తింపు తెస్తున్న  తాజాగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సైతం సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.

వ్యవసాయికంగా, సామాజికంగా, రాజకీయంగా పెద్ద గుర్తింపు ఉన్న కులం, ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు మున్నూరుకాపులు అన్నారు మంత్రి గంగుల. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో సంఘటితం అవుతున్న మున్నూరు కాపు బిడ్డలు, భవిష్యత్తులో పూర్తి ఐక్యమత్యంతో సంఘటితంగా ఉందామన్నారు. కుల బాంధవులు ఏ ఒక్కరికీ ఇబ్బంది ఎదురైనా కులం మొత్తం అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లోనూ మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో అన్ని రంగాల్లో తమ ఖ్యాతిని చాటుతారని… వారందరినీ సైతం సన్మానిస్తామన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు మున్నూరు కాపుల బలాన్ని గుర్తించాయని, ఏ పదవికి పోటీలో నిలిపినా కులమంతా  ఒక వైపే ఉండి గెలిపించు కుంటున్నాం అన్నారు. గ్రామాల్లో మున్నూరు కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని వారి మాటను సమాజం వింటుందని ఇది మున్నూరు కాపు ల రాజకీయ శక్తికి సంకేత మన్నారు.

ఇవాళ హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 5 కోట్లు ఐదు ఎకరాల భూమిని మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవనం కోసం కేటాయించారని, బేస్మెంట్ సిద్ధంగా ఉన్న ఈ ప్రాంతంలో లో బావి తరాలకు అద్భుతంగా నిలిచేలా MK టవర్ని అతి త్వరలోనే నిర్మించుకుందాం అన్నారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్న తాను ఇప్పటికే 15 కుల సంఘాలకు పట్టాలు అందజేశానని, మేర, మేదర సంఘాలు శంకుస్థాపనలు సైతం చేసుకున్నాయని గుర్తు చేశారు. అదే మాదిరిగా త్వరలోనే సకల సౌకర్యాలతో banquet hall గెస్ట్ రూమ్ లు, విద్యార్థులకు హాస్టల్ వసతి, దూరప్రాంతం నుండి వచ్చే మున్నూరు కాపులకు సేద తీర్చే విధంగా మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం ఉండబోతుంది అన్నారు మంత్రి గంగుల. ఇందుకోసం పక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అతి త్వరలోనే మున్నూరుకాపులు అందరం కలిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. కాచిగూడ భవనం సైతం మున్నూరు కాపు ల కె దక్కడం సంతోషకర పరిణామం అని అన్నారు మంత్రి గంగుల.

ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత లతోపాటు సభాధ్యక్షత వహించిన మున్నూరు కాపు రాష్ట్ర కమిటీ కన్వీనర్ పుట్టం పురుషోత్తమరావు, కో కన్వీనర్ చల్లా హరిశంకర్, ఆర్గనైజర్ కొండ దేవయ్య, అపెక్స్ కమిటీ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు ప్రముఖులు వి ప్రకాష్,  పి విఠల్, రౌతు కనకయ్య, గాలి అనిల్ కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన మున్నూరు కాపులు పాల్గొన్నారు.

Related posts

పరమహంస ఆశ్రమంలో దారుణ హత్య: సాధువు మృతి

Satyam NEWS

మ్యాచింగ్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచార కేంద్రం

Satyam NEWS

పెద్దదడిగి లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment