35.2 C
Hyderabad
April 27, 2024 12: 23 PM
Slider విజయనగరం

బాధితురాలి ఫిర్యాదుతో స్వ‌యంగా విచార‌ణలోకి డీఎస్పీ….!

#vijayanagarampolice

విజయనగరం ఎస్పీ ఆదేశాల‌తో ర‌గంలోకి దిగిన దిశ డీఎస్పీ త్రినాద్

స్ప‌ష్ట‌మైన వార్త‌లు…వేగ‌వంత‌మైన క‌థ‌నాల‌తో ఆన్ లైన్ మీడియా రంగంలో  దూసుకువెళుతున్న స‌త్యం న్యూస్.నెట్..ప్ర‌చ‌రిస్తున్న వార్త‌లు  ఎప్పుడూ సంచ‌ల‌నమే.రాష్ట్ర రాజ‌దాని అమ‌రావ‌తిలో అంశంలో హైకోర్టు తీర్పు గానివ్వండి…ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ‌స్తులు త‌ల‌పెట్టిన ధ‌ర్నా కానివ్వండి.ఇలా ప్ర‌తీ  అంశంలోనూ ఆన్ లైన్ నాడి ప‌ట్టుకుంటూ వాస్త‌వాల‌ను చూపెడుతున్న స‌త్యం న్యూస్.నెట్…తాజాగా మ‌రో న్యూస్ ను వెలుగులోకి తెచ్చింది.

అదీ విద్య‌ల‌న‌గ‌రంగా ఖ్యాతి పొందిన  విజ‌య‌న‌గ‌రంలో…ఓ బాదితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అస‌లు వాస్త‌వాన్ని తెలుసుకునేందుకు నేరుగా   డీఎస్పీ స్థాయి పోలీసు ఆఫీస‌ర్ సంఘ‌టాన స్థ‌లికి రావ‌డం..అదీ కాస్త స‌త్యం న్యూస్.నెట్ కు చిక్క‌డం జ‌రిగింది.ఓ బాదితురాలు ఫిర్యాదుతో…స్వ‌యంగా డీఎస్పీనే విచార‌ణ జ‌రిపేంద‌కు స్వ‌యంగా రంగంలోకి దిగారు. సంబంధిత విభాగ‌పు డీఎస్పీ  ఉన్నా….పోలీస్ బాస్ ఆదేశాల‌తో  నేరుగా రంగంలోకి దిగారు…దిశ డీఎస్పీ త్రినాద్.

వివ‌రాల్లోకి వెళితే…గ‌త నెల 22 వ వ తేదీన  ఓ అమ్మాయి …త‌న‌ను విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద త్రిశూల్ ర‌మ‌ణ స్కూల్  వద్ద అంగ‌న్ వాడీ కేంద్రం స‌మీపంలో  ఓ వ్య‌క్తి బ‌లాత్క‌రించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.స‌ద‌రు అమ్మాయిది ద‌ళిత కులం కావ‌డంతో అట్రాసిటీ కేసు క‌ట్టి…ఎస్సీ,ఎస్టీ డీఎస్పీకి అప్ప‌గించిందింది..పోలీస్ శాఖ.సీన్ క‌ట్ చేస్తే….ఎస్పీ ఆదేశాల‌తో  దిశ డిఎస్పీ త్రినాథ్…నేరుగా ఆ బాధితురాలిని  తీసుకుని ఘ‌టనా స్థ‌లిని ప‌రిశీలించారు.

ఓ లేడీ కానిస్టేబుల్.. కెమెరాతో స‌రాస‌రి  బాలాజీ న‌గ‌ర్ ఫ‌స్ట్ లైన్ లో అంగ‌న్వాడీ కేంద్రం వ‌ద్ద  బాధితురాలు చూపించిన స్థ‌లాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఆ ప‌క్క‌నే  స్టూడెంట్ కోచింగ్ సెంట‌ర్ వ‌ద్ద‌..సీసీ కెమెరాలను డీఎస్పీ ప‌రిశీలించారు. వెంట‌నే సెంట‌ర్ నిర్వాహ‌కుల‌ను పిలిపించి…ఈనెల 22న సీసీ పుటేజ్  కావాల‌ని కోరారు. డీఎస్పీ ఆదేశాల‌తో..త‌ప్ప‌కుండా సీసీ పుటేజ్ ను తీసి ఇస్తామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా   దిశ డీఎస్పీ త్రినాద్. స‌త్యం న్యూస్.నెట్ తో మాట్లాడుతూ….బాధితురాలు  ఫిర్యాదుతో  ఘ‌టనా స్థ‌లం చూసేందుకు వ‌చ్చామ‌న్నారు. కాగా..ఇటీవ‌లే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి వ‌ద్ద ఈ బాధితురాలు డ‌బ్బులు తీసుకుంద‌ని…స్వ‌యంగా అత‌గాడే ఫిర్యాదు చేసార‌ని  డీఎస్పీ చెప్పారు. కేసును క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని..ఎస్పీ ఆదేశాల‌తో  బాధితురాలికి  న్యాయం జ‌రిగేందుకు శాఖ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణానికి అంకురార్పణ

Satyam NEWS

కుడికిల్ల రైతుల భూములకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలి

Satyam NEWS

టోల్గేట్ సిబ్బందిపై చేయిచేసుకున్న వైసీపీ లేడీ లీడర్

Satyam NEWS

Leave a Comment