23.8 C
Hyderabad
September 21, 2021 22: 42 PM
Slider రంగారెడ్డి

ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి

#ZooPark

ఎట్టకేలకు చిరుత పులి పట్టుబడింది. హైదరాబాద్ నగర శివార్లలో గత కొద్ది కాలంగా హల్ చల్ సృష్టిస్తున్న చిరుత పులి కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.

చిరుత కోసం సిసి కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేసిన ఫలితం చిక్కలేదు.  వెతికి వెతికి అధికారులకే విసుగుపుట్టింది. వరుసగా దాడులు చేస్తూ ఆవులను చిరుత చంపుకుని తినేస్తున్నది.

నాలుగు నెలలుగా జనాలకు అటవీ శాఖ అధికారులకు  కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోన్ లో చిక్కింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చిరుత ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

Related posts

లాక్ డౌన్ ఉన్నంతకాలం పేదలకు ఆహారం అందిస్తా

Satyam NEWS

శ్మశానం లో మొక్కలు నాటిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

గుడ్ ఎఫెక్ట్: ఫలితాలను ఇస్తున్న కార్డన్ అండ్ సెర్చి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!