37.2 C
Hyderabad
April 30, 2024 12: 18 PM
Slider ప్రత్యేకం

22వ రోజుకు చేరిన ముస్లిం మైనార్టీ సోదరుల నిరసనలు

#hujurnagarmunicipality

హుజూర్‌నగర్ పట్టణంలో స్థానిక ఉస్మానియా మసీదు వక్ఫ్ షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దె చెల్లించని వారిని డీఫాల్టర్స్ గా గుర్తించి వారికి మసీదు  కాంప్లెక్స్ లో స్థానం లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లింల నిరసన 22వ రోజుకు చేరింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మజీద్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు 13 నెలలుగా చెల్లించని వారిని కాంప్లెక్స్ షాపుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ముస్లింల శాంతియుత నిరసన ఆదివారం 22వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ యూత్ నాయకులు షేక్ జానీపాషా  శిబిరం వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. వక్ఫ్ బోర్డు అధికారులారా!ఇకనైన మేల్కొని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వివిధ మసీదుల్లో పనిచేసే సిబ్బందికి 13 నెలలుగా జీతాలు రాకపోతే వారి కుటుంబ పోషణ ఎంత భారమౌతుందో వక్ఫ్ బోర్డు అధికారులకు కనిపించటం లేదా? అని జానిపాషా ఆవేదన వ్యక్తం చేశారు. మజీద్ కు కమిటీ వారు నిర్ణయించిన అద్దెలు చెల్లిస్తున్న వారికి  పట్టణ ముస్లింల పక్షాన అండగా ఉంటామని అన్నారు.

మసీదు కాంప్లెక్స్ లో సుమారు 25 సంవత్సరాలుగా షాపులలో అద్దెకు ఉంటూ నాటి నుండి నేటి వరకు నామమాత్రపు అద్దె ఎక్కడా లేని విధంగా చెల్లిస్తూ తమ సొంత ఆస్తిలా అనుభవిస్తూ ముస్లింలకు స్థానం కల్పించకుండా కాంప్లెక్స్ దుకాణాలపై ల కోట్లు సంపాదిస్తూ,మసీదుల అభివృద్ధికి, ముస్లింల సంక్షేమం కోసం పాటుపడని దుకాణదారులకు అండగా ఎవరున్నా,ఎంతటి వారినైనా,వదిలేది లేదని,అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీల నాయకులుఎండి.అజీజ్ పాషా,నవాబ్ జానీ.షేక్,షేక్ సైదా,షేక్ పాషా,అహమ్మద్, ఈసుబ్ మియా(వంట మేస్త్రి) పాషా జనిభాయ్,డ్రైవర్ ముస్తఫా,జానీ, మెయిన్,సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎస్పీ దీపికా సమక్షంలో గోడు చెప్పుకున్న బాధితులు..!

Satyam NEWS

హానర్: జూన్ 2న జెండా ఎగరేసేది వీరే

Satyam NEWS

షబ్బీర్ అలిని గెలిపించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపు

Satyam NEWS

Leave a Comment