29.7 C
Hyderabad
April 29, 2024 09: 22 AM
Slider కర్నూలు

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ తో శిక్షణ ఐఏఎస్ ల భేటీ

తెలంగాణకు కేటాయించిన 2021 బ్యాచ్క చెందిన ఏడుగురు శిక్షణ ఐఏఎఎస్ లు బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో భేటీ అయ్యారు.జిల్లా పరిపాలన, జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, విస్తీర్ణత, నీటి వనరులు,నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుల జీవనస్థితిగతులు, జిల్లా ప్రజల వ్యవసాయ ఆధారిత పనులు తదితర వివరాలను కలెక్టర్ ఉదయ్ కుమార్, శిక్షణ ఐఏఎస్ లకు వివరించారు.

2021 బ్యాచ్ కు చెందిన ఏడుగురు శిక్షణ ఐఏఎస్. లు రాధిక గుప్తా, శ్రీజ, పైజన్ అహ్మద్, గౌతమి,పింకేశ్కుమార్ లలిత్ కుమార్, లెనిన్ వస్తల్, శివేంద్ర ప్రతాప్ క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా జిల్లాల్లోని సోమశిల పర్యాటక ప్రదేశం, సింగోటం దేవాలయం, నల్లమల అటవీ ప్రాంతంలో రెండు రోజుల పాటు జిల్లాలో సందర్శించి అధ్యాయం చేయనున్నారు.

తెలంగాణ దర్శన్ లో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న వీరు సంస్థ డైరెక్టర్ జనరల్ బెనహర్ మహేశ్త్త ఎక్కా ఆదేశాల మేరకు కోర్స్ డైరెక్టర్ శ్రీదేవి ఐలూరి పర్యవేక్షణలో ఫీల్డ్ కో ఆర్డినే టర్ డాక్టర్ శ్రీనివాస్ పెద్ద బోయిన, పదరా తహసిల్దార్ కృష్ణయ్య శిక్షణ ఐఏఎస్ ల బృందం వెంట ఉన్నారు.

అనంతరం సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, సోమశిల పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఐఏఎస్ ల బృందం బయలుదేరి వెళ్లారు.

Related posts

పసుపు రైతులకు పాచిపోయిన అన్నం పెట్టిన బిజెపి

Satyam NEWS

నకిలీ లేఖలతో వేంకటేశ్వరుడి వద్దే మోసం

Satyam NEWS

యాక్ష‌న్ హీరో విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఎనిమీ`

Satyam NEWS

Leave a Comment