30.7 C
Hyderabad
February 10, 2025 21: 22 PM
Slider ఆధ్యాత్మికం

నకిలీ లేఖలతో వేంకటేశ్వరుడి వద్దే మోసం

Tirumala.Venkateswara.Temple.original.3339

తిరుమల వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో రావాలి కానీ మోసం చేసి కాదు. కానీ కొందరు మాత్రం మోసం చేసే వస్తున్నారు. తాను ఐఆర్‌ఎస్‌ అధికారినని, ముంబయిలో ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నానంటూ గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డి నకిలీ లేఖలో శ్రీవారి దర్శనానికి వచ్చాడు.

ఆయన తీసుకువచ్చిన సిఫారసు లేఖలు నకిలీవని జేఈఓ కార్యాలయం సిబ్బంది గుర్తించారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ తంతును గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

గతంలోనూ ఇదే తరహాలో నకిలీ లేఖలతో రత్నారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. నకిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు సిఫారసు లేఖలను కూడా జేఈఓ కార్యాలయం సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Related posts

విరామం లేకుండా పని చేస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు

Satyam NEWS

bye bye Mamata: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ

Satyam NEWS

చింతపల్లి మండలంలో 24 కరోనా కేసులు నిర్ధారణ

Satyam NEWS

Leave a Comment