40.2 C
Hyderabad
April 29, 2024 15: 42 PM
Slider ముఖ్యంశాలు

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటన

#lavusrikrishnadevarayalu

వైజాగ్‌లోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ రివ్యూ మీటింగ్స్ లో హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కు హిందుస్తాన్‌ షిప్‌ యార్డ్‌ కు చెందిన యూనియన్ సభ్యులు ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు.

దేశ ఆర్థిక పురోగాభివృద్ధిలో భాగంగా ఉన్న వైజాగ్‌లోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లోని పలు సమస్యలు పరిష్కారం జరిగేలా చొరవ చూపాలని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ ఎంప్లాయిస్‌ రైట్స్‌ ప్రోటెక్షన్‌ యూనియన్‌ సభ్యులు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కోరారు.

దేశంలో నౌకా నిర్మాణయానానికి ప్రసిద్ధి గాంచిన  హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సంస్థ.. 1961లో విశాఖపట్నంలో స్థాపించబడిందని… స్థాపించిన నాటి నుండి 200నౌకలను తయారుచేసినట్లు, 2004 నౌకలను రిపేర్‌ చేసినట్లు యూనియన్ సభ్యులు వివరించారు.

మొదట్లో ఈ షిప్‌యార్డ్‌ నందు వివిధ కేటగిరీల నందు.. 8000మంది ఉద్యోగస్తులు ఉండేవారని, ప్రస్తుతం 2616మందికి తగ్గించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ చేతి నందు నౌకా నిర్మాణాలకు కొరకు చాలా ఆర్డర్లు ఉన్నాయని, కానీ ఉద్యోగస్తుల కొరత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కొత్త ఉద్యోగస్తులను రెక్యూట్మెంట్ చేసుకోవాల్సి ఉందని, ఇది జరిగేలా చొరవ చూపాలని విన్నవించారు.

అంతేకాక 394మంది ఎల్‌ అండ్‌ ఎమ్‌ సిరీస్‌ వర్కర్‌లు రెగ్యులైజేషన్‌ లేకుండా గత 15–25ఏళ్ల నుండి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రెగ్యులైజేషన్‌ కోసం.. గత  6సంవత్సరాల క్రిందటే దాఖలు చేసుకున్నారని, ఈ ప్రక్రియ సంబంధిత డిఫెన్స్‌ మినిస్ట్రీ వద్ద పెండింగ్‌లో ఉందని, వెంటనే పరిష్కారం జరిగేలా చొరవ చూపాలని ఎంపీని కోరారు. ఈ సమస్యలు పరిష్కారం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

Related posts

వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు

Bhavani

సంక్రాంతి సంబరాలను నిర్వహించిన స్టార్‌మా

Satyam NEWS

విభజన చిచ్చు: ఇక బై..బై…వైసీపీ…

Satyam NEWS

Leave a Comment