32.7 C
Hyderabad
April 27, 2024 02: 15 AM
Slider సినిమా

ఈ విజయం మాకు ఎంతో ప్రత్యేకం: నరసింహపురం చిత్ర బృందం

#narasimhapuram

జులై 30న విడుదలైన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’ చిత్రం అనూహ్య విజయం సాధిస్తోంది. హీరో నందకిషోర్ నటన, శ్రీరాజ్ బళ్లా దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయ సమావేశం ఏర్పాటు చేసి… కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది.

ఈ ఆనంద వేడుకలో చిత్ర కథానాయకుడు నందకిషోర్, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, ఛాయాగ్రాహకుడు కర్ణ ప్యారసాని, గీత రచయిత గెడ్డం వీరు, చెల్లెలు పాత్రధారి ఉష, ముఖ్య పాత్రధారులు కళ్యాణ మాధవి, సంపత్ కుమార్, సాయి రాజ్, కో డైరెక్టర్ నాజర్ హుస్సేన్ పాలుపంచుకున్నారు. ప్రముఖ నిర్మాత-ఊర్వశి ఓటిటి సిఇవో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

“నరసింహపురం” చిత్రాన్ని గుండెలకు హత్తుకుంటున్న ప్రేక్షకులకు హీరో నందకిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకే కాకుండా… ఈ చిత్రంలో నటించిన, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. రెండేళ్ల తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడం పట్ల దర్శకనిర్మాతలు శ్రీరాజ్ బళ్లా-ఫణిరాజ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.

సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న “నరసింహపురం” చిత్రంలో నటించే, పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఉష, కల్యాణ మాధవి, సంపత్ కుమార్, సాయి రాజ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, గీత రచయిత గెడ్డం వీరు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతగా తనకు మూడు కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చిన శ్రీరాజ్ “నరసింహపురం”తో సూపర్ హిట్ కొట్టడం గర్వంగా ఉందన్నారు ముఖ్య అతిథి తుమ్మలపల్లి. యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, ‘అరవిందసమేత’ ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్ కుమార్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

Related posts

సమస్యలను లేవనెత్తే ఏకైక లీడర్ షర్మిల

Satyam NEWS

T20 World Cup : సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

Satyam NEWS

మాదిగ అమర వీరుల త్యాగం ఎంతో గొప్పది

Satyam NEWS

Leave a Comment