40.2 C
Hyderabad
April 29, 2024 17: 24 PM
Slider ముఖ్యంశాలు

20న హైదరాబాద్ వస్తున్న మోటివేషనల్ స్పీకర్ రాజ్ దీదీ

Raj didi

నారాయణ రైలీ సత్ సంగ్ పరివార్ (ఎన్ఆర్ఎస్ పి) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నారాయణ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ వ్యక్తిత్వ గురువు అందరూ ఆరాధనా భావంతో రాజ్ దీదీగా పిలుచుకునే రాజేశ్వరీ జై మోడీ పాల్గొంటారు. నారాయణ రైకీ హీలింగ్, ఆక్యుప్రెషన్ హీలింగ్ లాంటి మరెన్నో నారాయణి రైకీ కోర్సులను నిర్వహిస్తున్న అద్భుత ప్రాసంగీకురాలు అయిన రాజ్ దీదీ ఈ నారాయణ ఉత్సవంలో ప్రసంగిస్తారు.

ఎందరికో  స్ఫూర్తిగా నిలిచిన రాజ్ దీదీ పాల్గొనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని హైదరాబాద్ లకడీకా పూల్ వద్ద నున్న వాసవి సేవా కేంద్రంలో నిర్వహిస్తారు. ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన, అద్భుతమైన జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనే అంశంపై రాజ్ దీదీ ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రసంగిస్తారు. ముంబయిలో అక్యూప్రెషర్ థెరపిస్టు అయిన రాజ్ దీదీకి దేశ వ్యాప్తంగా వేలాది మంది అనుచరులు ఉన్నారు.

నారీ రత్న అవార్డు, సమాజ్ రత్న అవార్డు, రాజస్థాన్ నారీ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు లాంటి ఎన్నో పురస్కారాలు పొందిన రాజ్ దీదీ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గా అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. ఔత్సాహికులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహక సంఘం సభ్యులు కవిత తోన్సిహ్వాల్, సునీతా అతాసానియా, స్నేహలతా కేడియా, షీలా ధూత్, మీనాక్షీ బెహతీ, మోనికా రేతి, కవిరా అగర్వాల్, ప్రీతి టిబర్వాల్, సీమా జైస్వాల్, పూజా కాబ్రా, కోమల్, సీమా, కిరణ్ రతి, పూజా మర్దా, స్నేహా పాయల్ తెలిపారు.

Related posts

తమ్మినేని హత్యకేసులో 9మందికి బెయిల్  

Murali Krishna

పోలీసుల ముందే ఎంపిటిసి అభ్యర్ధిపై వైసిపి దాడి

Satyam NEWS

ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డి కి లేదా?

Bhavani

Leave a Comment