23.2 C
Hyderabad
May 7, 2024 20: 52 PM
Slider గుంటూరు

రైతుల భారత్ బంద్ కు మిత్ర పక్షాల సహకారం

#TDPNarasaraopet

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళవారం భారత్ బంద్ లో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ , సి.పి.ఐ, సి.పి.యం, యం.ఐ.యం,ముస్లీం జే.ఎ.సి ,సి.ఐ.టి.యు, యం.ఆర్.పి.ఎస్, సమాజవాది పార్టీ వివిధ కుల సంఘాలు  భరత్ బంద్ కు మద్దతు తెలియచేశాయి.

పట్టణంలోని ప్రధాన వీధులలో నుండి ఆర్.టి.సి బస్ స్టాండ్ , మల్లమ్మ సెంటర్, గాంధీ చౌక్ సెంటర్, గడియార స్థంభం సెంటర్, మునిసిపల్ కార్యాలయం మీదుగా ఆర్.డి.ఓ కార్యాలయo వరకు ర్యాలిగా వెళ్లి  మానవహారం నిర్వహించారు. దారి పొడుగునా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలతో నిరసన తెలియ చేశారు.

అనంతరం సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ అన్నం పెట్టె అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆలెక్జెండర్ సుధాకర్, శ్రామిక మహిళ సంఘం జిల్లా కార్యదర్శి డి.శివకుమారి, ఆవాజ్ జిల్లా నాయకులు శిలార్ మసూద్, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం జె.ఎ.సి రాష్ట్ర కన్వినర్ ఎస్.కే.జిలాని మాలిక్,

నరసరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు సలీం, సి.ఐ.టి.యు స్టేట్ సెక్రటరీ ముజఫర్ అహమ్మద్, సి.ఐ.టి.యు ఎల్.ఐ.సి యూనియన్ నాయకులు రబ్బాని, టి.డి.పి పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లేపు నాగేశ్వరరావు,

మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి, రాష్ట్ర మాజీ రైతు కార్యవర్గ నాయకులు గొట్టిపాటి జనార్ధన్ బాబు, జిల్లా మాజీ రైతు అధ్యక్షులు కడియం కోటి సుబ్బారావు, రొంపిచెర్ల మండలం మాజీ యం.పి.పి మొండితోక రామారావు, నరసరావుపేట మండలం టి.డి.పి అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరావు,

జిల్లా టి.డి.పి మాజీ అధ్యక్షులు కొట్ట కిరణ్ , టి.డి.పి లీగల్ సెల్ అధ్యక్షులు చెన్నుపాటి నాగేశ్వరరావు, నరసరావుపేట మండలం టి.డి.పి మైనార్టీ అధ్యక్షులు షెక్ మోతాజ్ హుస్సేన్, జిల్లా తెలుగు యువత మాజీ కార్యదర్శి రఫి, టి.డి.పి మైనార్టీ నాయకులు నజీర్, యార్డు వలి, బడే బాబు, సుభాని,

టి.డి.పి ఎస్.సి సెల్ నాయకులు వీరయ్య, బంగారం, టి.డి.పి ఎస్.టి సెల్ నాయకులు సాంబయ్య, టి.డి.పి తెలుగు యువత నాయకులు యం.నవీన్ చౌదరి, కోరిటాల శ్రీనివాసరావు, ఎస్.సి, ఎస్.టి , బి.సి , మైనార్టీ లు, మహిళ నాయకులు పాల్గొన్నారు. 

వన్ టౌన్ సి.ఐ ప్రభాకర్, ఎస్.ఐ.లు రబ్బాని, లక్ష్మి నారాయణ రెడ్డి, రామకోటేశ్వరరావు ల ఆధ్వర్యంలో  పట్టణం లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

Related posts

అమరగాయకుడు బాలు..అందరి మదిలో చిరస్మరణీయుడు..

Satyam NEWS

సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు…స్పందించవద్దు..

Satyam NEWS

పేదల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి

Bhavani

Leave a Comment