26.7 C
Hyderabad
April 27, 2024 08: 32 AM
Slider నల్గొండ

రైతులపై బలవంతపు చట్టాలు చేస్తే ఊరుకోం

#MLASaidireddy

భారత్ బంద్ కు మద్దతుగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పాత బస్టాండ్ సెంటర్ నుండి ఇందిరా చౌక్ వద్ద కు ఎడ్లబండిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష నాయకులతో పాటు కలిసి ఇందిరా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మీడియాతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, రైతులకు అన్యాయం చేయాలని చూస్తుందని, అందుకే బలవంతపు చట్టాలు చేస్తుందని అన్నారు.

రైతులు కన్నెర్ర చేస్తే ఎంతటి ప్రభుత్వాలు అయినా తలవంచాల్సిందేనని, రానున్న రోజుల్లో రైతుల నుండి ప్రధాని మోడీ  తీవ్ర వ్యతిరేకతను ఎదురుకోక తప్పదని అన్నారు.

గడ్డకట్టే చలిలో ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్నికి  దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నారని,  కేంద్ర ప్రభుత్వం చేసే రైతు నల్ల చట్టాలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందని, రైతు సంక్షేమం కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం trs ప్రభుత్వమని, తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతులకు లాభం చేకూరే విధంగా పథకాలు ప్రవేశ పెడుతూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు.

రైతు సంక్షేమ పార్టీ టి‌ఆర్‌ఎస్ పార్టని, రైతు క్షేమం కోసం   తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న  ఉచిత 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతుబంధు పథకాలు అమలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. దొంగ హామీలు ఇచ్చి ఇటు పసుపు రైతులను, రైతు నడ్డి వీరిచే చట్టాలు తీసుకువచ్చి, దేశంలోని రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

 బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా రైతులకు ఉచిత కరెంటు, ఎక్కడ  అమలు కావడం లేదని అన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాలేరైనా, ఖమ్మమైనా మాకు రెండు కళ్లు

Satyam NEWS

శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఉత్తమ్ దంపతులు

Satyam NEWS

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS

Leave a Comment